పోలవరం చీఫ్ ఇంజనీర్ తొలగింపు.. ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్

| Edited By:

Aug 28, 2019 | 9:32 PM

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో స్పీడు పెంచుతోంది. ఇప్పటికే రివర్స్ టెండరింగ్‌తో ముందుకు వెళ్లాలని భావించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టుగా అధికార వైసీపీ బలంగా వాదిస్తోంది. అయినప్పటికీ ఖచ్చితంగా సకాలంలో పూర్తి చేస్తామంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నీటి పారుదల చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న విధులు నిర్వహిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పించింది. అయితే ప్రాజెక్టు […]

పోలవరం చీఫ్ ఇంజనీర్ తొలగింపు.. ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్
Follow us on

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో స్పీడు పెంచుతోంది. ఇప్పటికే రివర్స్ టెండరింగ్‌తో ముందుకు వెళ్లాలని భావించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టుగా అధికార వైసీపీ బలంగా వాదిస్తోంది. అయినప్పటికీ ఖచ్చితంగా సకాలంలో పూర్తి చేస్తామంటోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నీటి పారుదల చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న విధులు నిర్వహిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పించింది. అయితే ప్రాజెక్టు బాధ్యతలను నుంచి తప్పించిన ప్రభుత్వం నీటిపారుదల చీఫ్ ఇంజనీర్‌గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా పీపీఏ సభ్యుడిగా కూడా ఆయన్ను తప్పించారు. ఆయన స్ధానంలో సుధాకర్ బాబుకు బాధ్యతలు అప్పగించారు.

ఇదిలా ఉంటే వెంకటేశ్వరావు 15 ఏళ్లపాటు పోలవరం కోసం కృషి చేశారు. వైఎస్‌తో పాటు నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో ఆయన విధులు నిర్వహించారు.