Big Breaking : ఆర్టీసీలో ఉద్యోగుల తొలగింపు లేదు..మంత్రి క్లారిటీ

|

May 16, 2020 | 7:33 PM

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఉపసంహరించుకుంది. కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేక‌త రావ‌డంతో… సిబ్బంది తొలగింపు నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 7600మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ నిన్న ఆర్టీసీ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్టీసీలో ఎవరినీ తొలగించడం లేదని.. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్ల‌డించారు. ఆర్టీసీలోని ఉద్యోగులందరూ యథాతథంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ప్ర‌భుత్వం ఎందుకు పునారాలోచించింది అంటే… క‌రోనా లాక్​డౌన్​తో సంక్షోభ‌ పరిస్థితులున్న సమయంలో […]

Big Breaking : ఆర్టీసీలో ఉద్యోగుల తొలగింపు లేదు..మంత్రి క్లారిటీ
Follow us on

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఉపసంహరించుకుంది. కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేక‌త రావ‌డంతో… సిబ్బంది తొలగింపు నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 7600మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ నిన్న ఆర్టీసీ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్టీసీలో ఎవరినీ తొలగించడం లేదని.. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్ల‌డించారు. ఆర్టీసీలోని ఉద్యోగులందరూ యథాతథంగా కొనసాగుతారని స్పష్టం చేశారు.

ప్ర‌భుత్వం ఎందుకు పునారాలోచించింది అంటే…

క‌రోనా లాక్​డౌన్​తో సంక్షోభ‌ పరిస్థితులున్న సమయంలో ఉద్యోగాల తొలగింపుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ కుటుంబాలు రోడ్డున పడతాయని వారికి న్యాయం చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సహా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి లేఖలు రాశాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్​ అసోసియేషన్ కూడా ఉద్యోగాల నుంచి తొలగించొద్దంటూ.. సీఎం జగన్ కు లేఖ రాసింది. లాక్​డౌన్ కాలంలో మాన‌వ‌తా విలువ‌ల‌తో ఆలోచించి ఏ ఉద్యోగినీ తొలగించొద్దని కేంద్రం చెప్పినా.. యాజమాన్యం పట్టించుకోకుండా తొలగించిందని సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కార్మిక సంఘాల అభ్య‌ర్థ‌న‌లు, అభ్యంతరంతో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పేర్ని నాని చ‌ర్చించారు. సీఎంఓ అధికారులు కూడా స్పందించి ఆర్టీసీ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడారు. అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రి పేర్నినాని ప్రకటన విడుదల చేశారు.