ఒక్కో చిన్నారికి రూ.15 వేలు ఖాయం కానీ.. కండిషన్స్ అప్లై..!

| Edited By:

Nov 04, 2019 | 11:59 AM

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం.. అధికారంలోకి రావడానికి ముఖ్యమైన కారణం ‘నవరత్నాల పథకం’ అనే చెప్పాలి. అంతేకాకుండా.. జగన్.. సీఎం అయ్యాక కూడా.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని విస్తృతంగా కృషి చేస్తున్నారు. కాగా.. నవరత్నాల్లో భాగమే.. ‘అమ్మఒడి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు జగన్. స్కూల్‌కి వెళ్లే.. ఒక్కో చిన్నారికి రూ.15వేలు ఇస్తున్నట్టు సీఎం జగన్ ఇదివరకే తెలిపారు. ప్రైవేట్ స్కూల్ ఫీజులు భరించలేక.. పిల్లల్ని సరిగా చదివించలేక.. తల్లిదండ్రులు పడుతున్న అవస్థను అర్థం చేసుకున్న జగన్.. ఈ పథకాన్ని […]

ఒక్కో చిన్నారికి రూ.15 వేలు ఖాయం కానీ.. కండిషన్స్ అప్లై..!
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం.. అధికారంలోకి రావడానికి ముఖ్యమైన కారణం ‘నవరత్నాల పథకం’ అనే చెప్పాలి. అంతేకాకుండా.. జగన్.. సీఎం అయ్యాక కూడా.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని విస్తృతంగా కృషి చేస్తున్నారు. కాగా.. నవరత్నాల్లో భాగమే.. ‘అమ్మఒడి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు జగన్. స్కూల్‌కి వెళ్లే.. ఒక్కో చిన్నారికి రూ.15వేలు ఇస్తున్నట్టు సీఎం జగన్ ఇదివరకే తెలిపారు. ప్రైవేట్ స్కూల్ ఫీజులు భరించలేక.. పిల్లల్ని సరిగా చదివించలేక.. తల్లిదండ్రులు పడుతున్న అవస్థను అర్థం చేసుకున్న జగన్.. ఈ పథకాన్ని తీసుకొచ్చారు.

కాగా.. ఈ పథకాన్ని వచ్చే ఏడాది 2020లో జనవరి 26 నుంచి ప్రారంభించబోతున్నట్టు కూడా.. అధికారికంగా సమాచారం. అయితే.. ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు ఈ అమ్మఒడి పథకానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయంట. దీంతో.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం ఉంది. అయితే.. వైసీపీ ప్రభుత్వం.. ఈ పథకం అమలుకు పలు కండిషన్స్‌ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. అవేంటంటే..!

  • తెల్ల రేషన్‌ కార్డ్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది
  • ఇన్‌కంటాక్స్ చెల్లించేవారికి కూడా ఈ పథకం వర్తించదు
  • ఐదెకరాల పొలం ఉన్నవారికి వర్తించదు
  • వ్యవసాయ భూమిని ఇల్లుగా మార్చుకున్నవారికి వర్తించదు
  • అన్ని రకాల పత్రాలు సరిగ్గా ఉండాలి

కాగా.. సీఎం జగన్ నుంచి ఈ పథకంపై ఇంకా ఎలాంటి ఆర్డర్స్ రాలేదు. అయితే.. పరిమితంగా కొంతమందికే.. ఈ ఆర్డర్ వర్తిస్తే మరి మిగిలినవారి సంగతి ఏంటని.. తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి.. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో.