అమరావతి రైతులకు అన్యాయం జరగదు: ఏపీ ప్రభుత్వం

| Edited By:

Aug 14, 2020 | 9:30 AM

కరోనా సంక్షభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల వల్ల అమరావతికి భూములిచ్చిన రైతుల ప్రాథమిక హక్కులకు ఎటువంటి భంగం

అమరావతి రైతులకు అన్యాయం జరగదు: ఏపీ ప్రభుత్వం
Follow us on

AP Government: కరోనా సంక్షభంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల వల్ల అమరావతికి భూములిచ్చిన రైతుల ప్రాథమిక హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ చట్టాల్లో రైతుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించామని పేర్కొంది. విస్తృత ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఏ చట్టాన్నైనా రద్దు చేసే అధికారం రాష్ట్రానికి ఉందని నివేదించింది.

నిపుణుల కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్నీ గ్రూపు రిపోర్ట్, హైపవర్‌ కమిటీ రిపోర్ట్‌ల నివేదికలను ఆధారంగా చేసుకునే హేతుబద్ధమైన నిర్ణయం తీసుకున్నామని, ఇది ఏకపక్ష నిర్ణయం కాదని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మాస్టర్‌ ప్లాన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చునని, దాని ఆధారంగా మాట్లాడటం సరికాదంది. గత నిర్ణయాన్ని పునఃసమీక్షించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణమని చెప్పింది. పాలన వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోనే ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు ఉండాలని పిటిషనర్లు కోరడం న్యాయబద్ధం కాదని ప్రభుత్వం తెలిపింది.