ఏపీలో పారిశ్రామిక పరుగులు.. మరో ఐదు ‘శ్రీసిటీ’లు..

| Edited By:

Jun 05, 2020 | 7:04 PM

సీఎం జగన్ సారథ్యంలో ఏపీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పటిష్టమైన ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌ ‘శ్రీసిటీ’ తరహాలో

ఏపీలో పారిశ్రామిక పరుగులు.. మరో ఐదు ‘శ్రీసిటీ’లు..
Follow us on

సీఎం జగన్ సారథ్యంలో ఏపీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పటిష్టమైన ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌ ‘శ్రీసిటీ’ తరహాలో మరో ఐదు పారిశ్రామిక పార్కులను నిర్మించడానికి కృషి చేస్తోంది. విజయవాడలోని ఎన్టీఆర్‌ పరిపాలన భవనంలో ఉన్న ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అధ్యక్షతన విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ గురువారం తొలిసారిగా సమావేశమైంది.

కాగా.. ఈ సమావేశంలో ముఖ్యంగా రక్షణ–ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా–హెల్త్‌కేర్, టెక్స్‌టైల్‌ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే విధంగా అన్ని వసతులతో డిజిగ్నేటెడ్‌ క్లస్టర్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లగ్‌అండ్‌ప్లే విధానంలో విదేశీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించుకునే విధంగా ఈ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు.

సంస్థల నుంచి పెట్టుబడి ప్రతిపాదన వచ్చిన 30 రోజుల్లో పరిశ్రమకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్, మానవ వనరులను అందించే విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న దేశాలను గుర్తించి వాటి కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెట్టుబడి ప్రతిపాదనలు వేగంగా వాస్తవరూపం దాల్చడం కోసం దేశాల వారీగా, రంగాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించనున్నారు.

Also Read: అంగన్‌వాడీల్లో ‘నాడు – నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..