మీడియం ఎంపిక అవకాశం తల్లిదండ్రులకే…కానీ…

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలుపై హైకోర్టు తీర్పుతో స‌ర్కార్ దిగొచ్చింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు ఏ మీడియంలో చదవాలో ఎంపిక చేసుకునే బాధ్యతను ప్రభుత్వం తల్లిదండ్రులకే కల్పించింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మ‌రోవైపు ఇంగ్లీషు మీడియంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో… పేరెంట్స్ అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి త‌ల్లిదండ్రుల‌ అభిప్రాయాలు సేకరించనున్నారు. దీని ఆధారంగా హైకోర్టు తీర్పును […]

మీడియం ఎంపిక అవకాశం తల్లిదండ్రులకే...కానీ...
Follow us

|

Updated on: Apr 22, 2020 | 4:32 PM

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలుపై హైకోర్టు తీర్పుతో స‌ర్కార్ దిగొచ్చింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు ఏ మీడియంలో చదవాలో ఎంపిక చేసుకునే బాధ్యతను ప్రభుత్వం తల్లిదండ్రులకే కల్పించింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

మ‌రోవైపు ఇంగ్లీషు మీడియంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో… పేరెంట్స్ అభిప్రాయాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి త‌ల్లిదండ్రుల‌ అభిప్రాయాలు సేకరించనున్నారు. దీని ఆధారంగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం డిసైడ‌యిన‌ట్టు తెలుస్తోంది. మే ఫ‌స్ట్ వీక్ లోనే సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు సర్కార్ సమాయత్తం అవుతున్నట్లు స‌మాచారం. గతంలో పేరెంట్స్ కమిటీలు ఇంగ్లీషు మీడియంపై ఇచ్చిన అభిప్రాయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడంతో… గ‌వ‌ర్న‌మెంట్ ఈ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక పేరెంట్స్ అభీష్టంమేర‌కు ఎక్కువమంది తెలుగు మీడియం ప్రిఫ‌ర్ చేస్తే.. అక్క‌డ ఆ మాధ్య‌మంలోనే తరగతులు కూడా నడపాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.