Divis Laboratories: దివిస్ ల్యాబరేటరిస్‌కు ఏపీ పరిశ్రమల శాఖ కీలక లేఖ.. పవన్ పర్యటన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం

|

Jan 09, 2021 | 1:33 PM

దివిస్ ల్యాబరేటరిస్‌కు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ రాసింది.  స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూపే ఎటువంటి వ్యర్ధాలను విడుదల చేయోద్దని లేఖలో సూచించింది. 

Divis Laboratories: దివిస్ ల్యాబరేటరిస్‌కు ఏపీ పరిశ్రమల శాఖ కీలక లేఖ.. పవన్ పర్యటన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం
Follow us on

Divis Laboratories:   దివిస్ ల్యాబరేటరిస్‌కు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ రాసింది.  స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూపే ఎటువంటి వ్యర్ధాలను విడుదల చేయోద్దని లేఖలో సూచించింది.  దివీస్ పరిశ్రమకు స్థలం ఇచ్చిన తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపాకల ప్రాంతంలో అనేక హ్యాచరీస్ (కోడి పిల్లల ఉత్పత్తి) పరిశ్రమలు, ఆక్వా ప్రాజెక్టులు ఉన్నాయని అని  పరిశ్రమల డైరెక్టర్ జేవిఎన్ సుబ్రమణ్యం లేఖలో పేర్కొన్నారు. హ్యాచరీస్ కారణంగా గ్రామీణ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని.. వ్యర్థాల కారణంగా వారు ఆ అవకాశాలు కోల్పోయే ఛాన్స్ ఉందని భావిస్తున్నట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ తెలిపారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టకుండా ఉండడం సరికాదని..  ఎటువంటి వ్యర్ధాలను విడుదల చేయోద్దని ఆమన స్పష్టం చేశారు.

మరోవైపు తుని నియోజకవర్గంలోని కొత్తపాకలలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు చేస్తోన్న ఆందోళనకు పవన్‌ మద్ధతు తెలపారు. దివీస్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్య కార్మికులకు, ప్రజలకు మద్దతుగా జిల్లాలో పవన్‌ పర్యటన  శనివారం కొనసాగనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.

Also Read :

Sheep Distribution: గొల్ల, కురుమలకు గుడ్ న్యూస్.. మొదటి విడత గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని సీఎం ఆదేశం

Today Gold and Silver Price: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..తాజా రేట్లు ఇలా ఉన్నాయి