నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

|

Oct 08, 2020 | 5:19 PM

నిరుపేద కుటుంబాలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. నవశకం కార్యక్రమం ద్వారా తెల్ల రేషన్ కార్డులు పొందనివారు.. మరోసారి కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్నిప్రభుత్వం కల్పించింది.

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
Follow us on

One More Chance To Get White Ration Card: నిరుపేద కుటుంబాలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. నవశకం కార్యక్రమం ద్వారా తెల్ల రేషన్ కార్డులు పొందనివారు.. మరోసారి కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపన్ను చెల్లింపుదారులు, పరిమితికి మించి సొంత భూమి కలిగి ఉన్నవారు, అత్యధిక విద్యుత్ వినియోగం, ఇతరత్రా కారణాల వల్ల నవశకం కార్యక్రమంలో తెల్ల రేషన్ కార్డుకు అనర్హులైన లబ్దిదారులు.. సహేతుక ఆధారాలతో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చునని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా వెల్లడించారు.

తెల్ల రేషన్ కార్డు కోసం లబ్దిదారులు తమ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని.. ఆ అప్లికేషన్ ఫార్మ్‌తో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను కూడా జత చేయాలని సూచించారు. ఆ దరఖాస్తులను సంబంధిత గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది పరిశీలిస్తారు. తద్వారా అనర్హత పొందినవారు మరలా తెల్ల రేషన్ కార్డు పొందే అవకాశాలు ఉంటాయని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..