ఏపీ సర్కార్ కీల‌క నిర్ణ‌యం.. అర్చకులు, ఇమామ్, మౌజమ్, పాస్టర్ లకు రూ.5 వేల ఆర్థిక‌ సాయం..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సామాన్యులకు జీవనభృతి కరువయింది. అయితే..

ఏపీ సర్కార్ కీల‌క నిర్ణ‌యం.. అర్చకులు, ఇమామ్, మౌజమ్, పాస్టర్ లకు రూ.5 వేల ఆర్థిక‌ సాయం..

Edited By:

Updated on: May 21, 2020 | 3:24 PM

AP Government financial aid: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సామాన్యులకు జీవనభృతి కరువయింది. అయితే.. అర్చకులకు, ఇమామ్, మౌజం, పాస్టర్ లకు ఒకసారి సహాయం కింది 5,000 రూపాయలు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద మొత్తం 33 కోట్ల 92 లక్షల రూపాయల నిధులను సర్కార్ మంజూరు చేసింది. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31,017 మంది అర్చకులకు, 7,000 మంది ఇమామ్ మరియు మౌజమ్ లకు, 29,841 మంది పాస్టర్ లకు లబ్ది చేకూరుతుంది.

కాగా.. లాక్‌డౌన్ క్రమంలో ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. దీంతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు తెలిపారు. అదే విధంగా ఇమామ్, మౌజం, పాస్టర్ లకు కూడా ఒకసారి సహాయం కింది 5000 రూపాయలు మంజూరు చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.