ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జేసీ పోస్టుల పెంపు..!

| Edited By:

May 07, 2020 | 10:48 AM

కరోనా మహమ్మారి కట్టడికోసం లాక్‌డౌన్ నడుస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జేసీ పోస్టుల పెంపు..!
Follow us on

కరోనా మహమ్మారి కట్టడికోసం లాక్‌డౌన్ నడుస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కొత్తగా 13 మంది జాయింట్ కలెక్టర్లను నియమించింది. మరో ముగ్గురు జేసీలకు శాఖలను బదలాయించింది. రైతుభరోసా, రెవెన్యూ శాఖల కోసం ప్రత్యేకంగా జేసీని నియమించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, రెవెన్యూ ఎక్సైజ్‌, మైన్స్ బాధ్యతలను ఆర్ అండ్ ఆర్ జాయింట్ కలెక్టర్ చూడనున్నారు.

కాగా.. ఈ పోస్టులను 3 విభాగాలుగా రీ-డిజిగ్నేషన్ చేసి పర్యవేక్షించే విభాగాలను కేటాయించింది. గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రత్యేకంగా మరో జేసీని నియమించారు. సచివాలయాలు, పంచాయతీరాజ్, వైద్యరోగ్యం, విద్య, మునిసిపల్, హౌసింగ్, ఇంజినీరింగ్ విభాగాల బాధ్యతలు చూడ్డానికి మరో జేసీని నియమించింది ప్రభుత్వం. ఆసరా, సంక్షేమ పథకాల అమలు కోసం కొత్తగా మరో జాయింట్ కలెక్టర్‌ను.. గ్రామీణాభివృద్ధి, అన్ని సంక్షేమ శాఖలు, పరిశ్రమలు, దేవాదాయ, స్కిల్ డెవెలప్‌మెంట్ శాఖల బాధ్యతలను మూడో జేసీకి అప్పగించింది.