మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

|

Aug 04, 2020 | 6:22 AM

మహిళా సాధికారత దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగానే హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ తదితర కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది.

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న వైఎస్ఆర్ చేయూతకు శ్రీకారం..
Follow us on

Women Empowerment: మహిళా సాధికారత దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగానే హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ తదితర కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా ఆయా కంపెనీల అధికారులతో సమావేశమైన సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”ఆగష్టు 12వ తేదీన ‘వైఎస్ఆర్ చేయూత’ పధకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పధకం ద్వారా లబ్దిదారులుగా ఎంపికైన 45-60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు గాను రూ. 75 వేల ఆర్ధిక సాయాన్ని అందిస్తామన్నారు.

అంతేకాకుండా మహిళలకు స్థిరమైన ఆదాయం వచ్చేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. దీని కోసం ఇటీవలే అమూల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఇక ‘వైఎస్ఆర్ ఆసరా’తో డ్వాక్రా మహిళలకు రూ. 6700 కోట్ల రుణ సాయం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ రెండు పధకాల ద్వారా సుమారు కోటి మందికి పైగా మహిళలు లబ్ది పొందుతారని ఆయన తెలిపారు. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల కోసం ఏటా దాదాపు రూ.11 వేల కోట్లు చొప్పున నాలుగేళ్లకు రూ. 44 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

Also Read:

జగన్ సంచలన నిర్ణయం.. నాలుగు జోన్లుగా ఏపీ విభజన.!

కరోనా డేంజర్ బెల్స్.. ఏపీలోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్.!