లాక్‌డౌన్‌ సడలింపులపై మరోసారి ఏపీ స‌ర్కార్ ఆదేశాలు..వ్య‌వ‌సాయంపై కీల‌కం

|

May 16, 2020 | 8:01 PM

లాక్‌డౌన్‌ సడలింపులపై ఏపీ స‌ర్కార్ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రైతులు చేసుకునే వ్యవసాయ పనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకాలు కలిగించకూడదని సూచించింది. కంటైన్‌మెంట్ ఏరియాలు త‌ప్ప‌ ఎక్కడా వ్యవసాయ పనులకు ఆటంకం కలగవద్దని ఆదేశించింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, కొనుగోళ్లు..అమ్మ‌కాల‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టం చేసింది. విత్తనాలు, ఎరువులు, కూలీల రవాణా అంశాల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. వ్యవసాయ సంబంధిత‌ యంత్ర పరికరాల విక్రయాలు, మరమ్మతుల షాపుల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఉదయం 7 […]

లాక్‌డౌన్‌ సడలింపులపై మరోసారి ఏపీ స‌ర్కార్ ఆదేశాలు..వ్య‌వ‌సాయంపై కీల‌కం
Follow us on

లాక్‌డౌన్‌ సడలింపులపై ఏపీ స‌ర్కార్ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రైతులు చేసుకునే వ్యవసాయ పనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకాలు కలిగించకూడదని సూచించింది. కంటైన్‌మెంట్ ఏరియాలు త‌ప్ప‌ ఎక్కడా వ్యవసాయ పనులకు ఆటంకం కలగవద్దని ఆదేశించింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, కొనుగోళ్లు..అమ్మ‌కాల‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టం చేసింది. విత్తనాలు, ఎరువులు, కూలీల రవాణా అంశాల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

వ్యవసాయ సంబంధిత‌ యంత్ర పరికరాల విక్రయాలు, మరమ్మతుల షాపుల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ వ్య‌వ‌సాయానికి సంబంధించిన షాపులు తెరిచి ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. షాపుల‌ వద్ద గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.