YSR Aarogya Sri: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘ఆరోగ్య ఆసరా’ చికిత్సల సంఖ్య భారీగా పెంపు..

|

Dec 31, 2020 | 7:54 AM

YSR Aarogya Sri: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'వైఎస్సార్ ఆరోగ్య ఆసరా' చికిత్సల సంఖ్యను భారీగా పెంచింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ..

YSR Aarogya Sri: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరోగ్య ఆసరా చికిత్సల సంఖ్య భారీగా పెంపు..
Follow us on

YSR Aarogya Sri: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ చికిత్సల సంఖ్యను భారీగా పెంచింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 836 చికిత్సలకు వైద్యం చేయించుకున్న తర్వాత రోజుకు కనిష్టంగా రూ. 225 చొప్పున, గరిష్టంగా నెలకు రూ. 5 వేలు ఆర్ధిక సాయం చేస్తుండగా.. ఇప్పుడు మరో 683 చికిత్సలకు కూడా వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా చేర్చిన చికిత్సల జాబితాలో డయాబెటిక్‌ ఫుట్, డెంగీ జ్వరం వంటివి ఉన్నాయి. దీనితో మొత్తం చికిత్సల సంఖ్య 1,519కి చేరింది. కాగా, ఇందుకోసం ఏడాదికి రూ. 60 కోట్లు ఖర్చవుతుందని సర్కార్ అంచనా వేస్తోంది. రోగులు తమ ఆధార్‌ను బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయాలని.. అలా ఉంటే వెంటనే నిధులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!

వైఎస్సార్ రైతు భరోసా డబ్బు జమ కాలేదా.? అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి.!

ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు

ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.!