ఆంధ్రా ‘ఆక్టోపస్’ సర్వే అట్టర్ ప్లాప్..!

|

May 23, 2019 | 12:49 PM

ఆంధ్రా ‘ఆక్టోపస్’గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే మరోసారి ఫెయిల్ అయ్యింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా.. టీఆర్ఎస్ అత్యధిక సీట్లతో విజయం సాధించింది. అలాగే ఆయన తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే నిర్వహించి టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన సర్వేకి వ్యతిరేకంగా వైసీపీ చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది. దీనితో లగడపాటి రాజగోపాల్ సర్వే చేసి.. ఏ పార్టీ […]

ఆంధ్రా ఆక్టోపస్ సర్వే అట్టర్ ప్లాప్..!
Follow us on

ఆంధ్రా ‘ఆక్టోపస్’గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే మరోసారి ఫెయిల్ అయ్యింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా.. టీఆర్ఎస్ అత్యధిక సీట్లతో విజయం సాధించింది. అలాగే ఆయన తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే నిర్వహించి టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన సర్వేకి వ్యతిరేకంగా వైసీపీ చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది. దీనితో లగడపాటి రాజగోపాల్ సర్వే చేసి.. ఏ పార్టీ గెలుస్తుందని చెబితే ఆ పార్టీ ఓడిపోతుందని జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు. లగడపాటి ఇచ్చిన సర్వేపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించి.. ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.