AP Election Commission: ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‌పై వేటు..

|

Jan 11, 2021 | 1:55 PM

AP Election Commission: ఏపీలో స్థానిక ఎన్నికల కమిషన్ తీరును ఉద్యోగ సంఘాలే కాదు.. SEC ఆఫీస్‌లో కూడా ఎవరైనా వ్యతిరేకత చూపిస్తున్నారా?..

AP Election Commission: ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‌పై వేటు..
Follow us on

AP Election Commission: ఏపీలో స్థానిక ఎన్నికల కమిషన్ తీరును ఉద్యోగ సంఘాలే కాదు.. SEC ఆఫీస్‌లో కూడా ఎవరైనా వ్యతిరేకత చూపిస్తున్నారా? నిమ్మగడ్డ ఆఫీస్‌లో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఇదే ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఏపీ ఎన్నికల సంఘం జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో ఉన్న జీవీ సాయిప్రసాద్‌పై వేటు వేసింది SEC.

ఎందుకంటే ఆయన షెడ్యూల్ ఇచ్చిన తర్వాత 30 రోజుల పాటు సెలవుపై వెళ్లడమే కాకుండా.. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని SEC ఆరోపిస్తోంది. ఎన్నికలకు విఘాతం కలిగిస్తున్నాడన్న ఆరోపణలతో ఎన్నికల కమిషన్‌ అతనిపై వేటు వేసింది. ఆర్టికల్ 243రెడ్‌విత్, ఆర్టికల్ 324 ప్రకారం తొలగిస్తున్నామంది SEC. ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగాగానీ..పరోక్షంగాగానీ విధులు నిర్వహించడానికి వీలులేదన్నఆదేశం కూడా ఆర్డర్స్‌లో ఉంది.