గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..సినీ ఫక్కీలో విరుచుకుపడ్డ దుండగుడు..సీరియస్‌గా తీసుకున్న ఏపీ డీజీపీ ‌

|

Dec 14, 2020 | 6:44 AM

వీరవాసం ఏఎస్‌ఐపై కత్తితో దాడి జరిగిన ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. గాయపడిన పార్థసారధికి అత్యవసర వైద్యం అందించాలని జిల్లా ఎస్‌పిని ఆదేశించారు. అంతేకాదు ఈ ఘటనతో సంబంధం

గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..సినీ ఫక్కీలో విరుచుకుపడ్డ దుండగుడు..సీరియస్‌గా తీసుకున్న ఏపీ డీజీపీ ‌
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసం ఏఎస్‌ఐ పార్థసారధిపై దాడి జరిగింది. మత్స్యపురి రోడ్డులో పొలం విషయంలో గొడవ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు, వారిని కట్టడి చేసేందుకు వెళ్లారు. ఏఎస్‌ఐ పార్థసారధితో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ మూర్తి కూడా గొడవ జరుగుతున్న స్థలానికి వెళ్లారు. అయితే హఠాత్తుగా ఓ వ్యక్తి పోలీసులపై దాడి చేశాడు. కత్తితో దాడి చేయడంతో ఏఎస్‌ఐ పార్థసారధి తీవ్రంగా గాయపడ్డాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ మూర్తి తృటిలో తప్పించుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఏఎస్‌ఐని భీమవరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పార్థసారధికి చికిత్స కొనసాగుతోంది.

వీరవాసం ఏఎస్‌ఐపై కత్తితో దాడి జరిగిన ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. గాయపడిన పార్థసారధికి అత్యవసర వైద్యం అందించాలని జిల్లా ఎస్‌పిని ఆదేశించారు. అంతేకాదు ఈ ఘటనతో సంబంధం ఉన్న అందరినీ రౌండప్‌ చేయాలని ఆదేశించారు. సంఘటనా స్థలానికి వెళ్లి, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక అందించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. దీంతో అసలు పోలీసులపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? అక్కడున్నవారు ఎందుకు అడ్డుకోలేకపోయారు ? అని జిల్లా ఎస్‌పి ఆరా తీస్తున్నారు.

మరోవైపు ఏఎస్‌ఐపై దాడి ఘటన ఇటు పోలీస్‌ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పోలీసులకే రక్షణ లేకుంటే ఎలా అని పోలీసులు, ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌ మొదలైంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు, ఉన్నతాధికారులు సూచించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపింది.