పోలవరం పనులపై జగన్ ప్రశ్నలు.. అధికారులు ఉక్కిరిబిక్కిరి..!

| Edited By: Srinu

Jun 20, 2019 | 4:43 PM

తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ గురువారం ఉదయం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అమరావతి నుంచి పోలవరం చేరుకున్న ఆయన మొదట ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలన చేశారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన కాఫర్ డ్యామ్, సాంకేతిక అంశాలపై అధికారులను లోతుగా ప్రశ్నించారు. ఎగువ కాఫర్ డ్యాం పనులు ఎంతవరకూ పూర్తయ్యాయని, భారీగా వరద వస్తే పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇది కొట్టుకుపోకుండా తీసుకున్న చర్యలు ఏమిటన్నారు..? […]

పోలవరం పనులపై జగన్ ప్రశ్నలు.. అధికారులు ఉక్కిరిబిక్కిరి..!
Follow us on

తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ గురువారం ఉదయం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అమరావతి నుంచి పోలవరం చేరుకున్న ఆయన మొదట ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలన చేశారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన కాఫర్ డ్యామ్, సాంకేతిక అంశాలపై అధికారులను లోతుగా ప్రశ్నించారు. ఎగువ కాఫర్ డ్యాం పనులు ఎంతవరకూ పూర్తయ్యాయని, భారీగా వరద వస్తే పరిస్థితి ఏంటని నిలదీశారు. ఇది కొట్టుకుపోకుండా తీసుకున్న చర్యలు ఏమిటన్నారు..?

అటు.. ముఖ్యంగా కాఫర్ డ్యాం పనులు అసంపూర్తిగా ఉండటం పట్ల జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వరదలు వచ్చే నాటికి పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. వరదలు విజృంభిస్తే పరిస్థితి ఏమిటని నిలదీశారు. దీంతో.. ఇరిగేషన్ అధికారులు ఉక్కిరి బిక్కిరయ్యారు. కాగా.. కాఫర్ డ్యాం వద్ద ముఖ్యమంత్రిని కలిసిన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నిర్వాసితులు. ఇళ్ళనిర్మాణం, నష్టపరిహరం, ఆర్&ఆర్ ప్యాకేజీ సమస్యలపై మెమోరాండం ఇచ్చిన నిర్వాసితులు..