కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

| Edited By:

May 14, 2020 | 11:38 AM

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్తు బిల్లులపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30 వరకూ విద్యుత్తు బిల్లుల చెల్లింపులను వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో విద్యుత్తు బిల్లులు అధికంగా రావడంతో ప్రభుత్వంపై విమర్శలు..

కరెంట్ బిల్లులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్తు బిల్లులపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30 వరకూ విద్యుత్తు బిల్లుల చెల్లింపులను వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో విద్యుత్తు బిల్లులు అధికంగా రావడంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో వేలకు వేలు కరెంట్ బిల్లులు రావడంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ బిల్లుల చెల్లింపును జూన్ 30వ తేదీ వరకూ వాయిదా వేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమవ్వడం, దీనికి తోడు ఎండలు ముదరడంతో కరెంట్ వినియోగం పెరిగింది. అందులోనూ కరోనా దెబ్బకు గత నెలలో కరెంటు బిల్లు ఇవ్వలేదు. రెండు నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వాలని ఏపీ విద్యుత్ శాఖ నిర్ణయించింది. అయితే 500 యూనిట్లు దాటే సరికి టారిఫ్ మారిపోవడంతో ప్రజలకు బిల్లు వేలకు వేలు వచ్చింది. దీంతో వినియోగదారులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలా పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఏపీ విద్యుత్ శాఖ స్పందించింది. కోటీ 45 లక్షల మంది వినియోగదారులకు వచ్చిన బిల్లులను ర్యాండమ్‌గా చెక్ చేస్తామని ప్రకటించింది. సందేహం ఉన్న వారికి.. అనుమానాలను నివృత్తి చేస్తామని విద్యుత్ శాఖ వెల్లడించింది.

Read More:

లాక్‌డౌన్‌లో సింపుల్‌గా హీరో నిఖిల్ పెళ్లి..

రానా, మిహీకాల పెళ్లి ఎప్పుడో చెప్పేసిన సురేష్ బాబు

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్