కడప స్టీల్‌ప్లాంట్ పనులపై సీఎం జగన్ సమీక్ష

| Edited By: Pardhasaradhi Peri

Oct 26, 2020 | 9:18 PM

కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ఏడు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి ప్రతిపాదనలు పరిశీలించి.. కంపెనీ ఎంపిక త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అందుకు ఏడు వారాలు పడుతుందన్న అధికారులు..

కడప స్టీల్‌ప్లాంట్ పనులపై సీఎం జగన్ సమీక్ష
Follow us on

AP CM Jagan Review : కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ఏడు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి ప్రతిపాదనలు పరిశీలించి.. కంపెనీ ఎంపిక త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అందుకు ఏడు వారాలు పడుతుందన్న అధికారులు.. ఆ ప్రక్రియ పూర్తయ్యాక నెలరోజుల్లో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆ సమయాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి జగన్.

కడప స్టీల్‌ప్లాంట్‌తో పాటు.. కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌పైనా సమీక్ష చేశారాయన. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు పెండింగ్‌లో ఉంటే.. నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నారు. కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.