ఏపీ సామాజిక ఆర్ధిక సర్వేను విడుదల చేసిన సీఎం జగన్..

|

Jun 16, 2020 | 12:10 AM

2019-20 ఆర్ధిక సంవత్సరానికి గానూ సామాజిక ఆర్ధిక సర్వేను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తొలిసారిగా శాసనసభకు బదులుగా క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ సర్వేను రిలీజ్ చేశారు. నవరత్నాలలో భాగమైన విద్య, వైద్యం, సామాజిక భద్రతా అంశాలు, రైతు సంక్షేమం, పేదల సంక్షేమం లాంటి అంశాలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు సోషియో ఎకనామిక్ సర్వే పేర్కొంది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9,72,782 కోట్లుగా ప్రణాళికా విభాగం […]

ఏపీ సామాజిక ఆర్ధిక సర్వేను విడుదల చేసిన సీఎం జగన్..
Follow us on

2019-20 ఆర్ధిక సంవత్సరానికి గానూ సామాజిక ఆర్ధిక సర్వేను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తొలిసారిగా శాసనసభకు బదులుగా క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ సర్వేను రిలీజ్ చేశారు. నవరత్నాలలో భాగమైన విద్య, వైద్యం, సామాజిక భద్రతా అంశాలు, రైతు సంక్షేమం, పేదల సంక్షేమం లాంటి అంశాలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు సోషియో ఎకనామిక్ సర్వే పేర్కొంది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9,72,782 కోట్లుగా ప్రణాళికా విభాగం పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12.73 శాతం మేరకు జీఎస్డీపీలో వృద్ధి కనిపించిదని తెలిపింది. 2018-19తో పోలిస్తే 1.10 లక్ష కోట్ల పెరుగుదల ఉందని పేర్కొన్న ప్రణాళికా విభాగం.. మొత్తంగా రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 8.16గా ఉందని స్పష్టం చేసింది. స్థిర ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 6,72,018 కోట్లుగా నమోదైనట్టు వెల్లడించింది.

ప్రస్తుత ధర వద్ద జీఎస్డీపీలో వ్యవసాయ రంగం వాటా 3,20,218 కోట్లు, పరిశ్రమల రంగం వాటా 1,91,857 కోట్లు, సేవల రంగం వాటా 3,67,747 కోట్లుగా ప్రణాళికా విభాగం పేర్కొంది. అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం జీవీఏ 18.96 శాతం పెరిగినట్లు, అలాగే పరిశ్రమల రంగం స్థిర ధరల వద్ద 2019-20 ఏడాదికి 5.67శాతం వృద్ధి నమోదైనట్లు తెలుస్తోంది. అటు రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని ప్రణాళికా విభాగం పేర్కొంది.