తిరుమలకు రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు

|

Sep 22, 2020 | 7:02 PM

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు (బుధవారం) ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ తిరుమ‌ల ప‌ర్య‌ట‌నకు సంబంధించిన‌ ఏర్పాట్ల‌ను  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌...

తిరుమలకు రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు
Follow us on

Ap Cm YS Jagan : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు (బుధవారం) ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ తిరుమ‌ల ప‌ర్య‌ట‌నకు సంబంధించిన‌ ఏర్పాట్ల‌ను  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి, సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి పరిశీలిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం నుండి శ్రీ‌వారి ఆల‌యం వ‌ర‌కు, నాద‌నీరాజ‌నం వేదిక వ‌ద్ద భ‌ద్ర‌త ఇత‌ర ఏర్పాట్లను ప‌రిశీలించారు. అక్కడి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కు ఇద్దరు ముఖ్య‌మంత్రులు వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, బిఎస్‌.య‌డ్యూర‌ప్ప నాద‌నీరాజ‌నం వేదిక‌పై సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో పాల్గొంటారు. వేదిక‌పై భ‌ద్ర‌త‌, అలంక‌ర‌ణ‌, కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల్సిన తీరుపై చ‌ర్చించారు. అనంత‌రం గోకులం విశ్రాంతి గృహంలోని స‌మావేశ మందిరంలో ఈ అంశంపై అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి  టీటీడీ అధికారులు, పండితుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజులు పాటు తిరుమలలోనే సీఎం వైఎస్ జగన్ ఉండనున్నారు. 23వ తేదీ సాయంత్రం తిరుమలకు సీఎం చేరుకోనున్నారు.  24న ఉదయం జగన్.. శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కొవిడ్‌-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తూన్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం కర్నాటక అతిధి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇద్దరు సీఎంలూ పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహంకు చేరుకోని అల్పాహారం స్వీకరించి సీఎం జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.