కాంట్రాక్ట్ ఉద్యోగులపై సీఎం జగన్ కీలక నిర్ణయం

| Edited By:

Jul 10, 2019 | 5:06 PM

పాలనలో దూకుడుగా వెళ్తున్న ఏపీ సీఎం జగన్ పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వర్గాలను ఆకర్షిస్తున్నారు. ఎక్కడా అసంతృప్తి అనేది లేకుండా జాగ్రత్తపడుతున్నారు. తాజాగా ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న వారిని క్రమబద్దీకరించేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ విషయంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటిని సైతం నియమించారు. ఈ మంత్రి వర్గ ఉపసంఘంలో మంత్రులు బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, […]

కాంట్రాక్ట్ ఉద్యోగులపై   సీఎం జగన్ కీలక నిర్ణయం
Follow us on

పాలనలో దూకుడుగా వెళ్తున్న ఏపీ సీఎం జగన్ పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వర్గాలను ఆకర్షిస్తున్నారు. ఎక్కడా అసంతృప్తి అనేది లేకుండా జాగ్రత్తపడుతున్నారు. తాజాగా ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న వారిని క్రమబద్దీకరించేలా చర్యలు చేపట్టనున్నారు.

ఈ విషయంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటిని సైతం నియమించారు. ఈ మంత్రి వర్గ ఉపసంఘంలో మంత్రులు బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేశ్, ఆళ్ల నాని ఉన్నారు. వీరు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి ఏమేరకు క్రమబద్దీకరణ అవసరమో పూర్తి స్ధాయిలో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారు. ఇక ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్పీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.