Anupama: ‘పక్షుల కిలకిల రావాలు.. ప్రకృతిలో నడక.. అందమైన చిరునవ్వు’.. ఆకట్టుకుంటోన్న అనుపమ హావభావాలు..

|

Jan 22, 2021 | 11:18 AM

Anupama Instagram Post Viral: మలయాళ చిత్రం 'ప్రేమమ్‌'తో వెండితెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార అనుపమ పరమేశ్వరన్‌. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది నటనలోనూ మంచి మార్కులే కొట్టేసింది...

Anupama: పక్షుల కిలకిల రావాలు.. ప్రకృతిలో నడక.. అందమైన చిరునవ్వు.. ఆకట్టుకుంటోన్న అనుపమ హావభావాలు..
Follow us on

Anupama Instagram Post Viral: మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో వెండితెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార అనుపమ పరమేశ్వరన్‌. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది నటనలోనూ మంచి మార్కులే కొట్టేసింది. ఇక తెలుగులో ‘ప్రేమమ్‌’ రీమేక్‌తో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మనసులను కొల్లగొట్టిందీ కేరళ కుట్టీ. అనంతరం ‘అఆ’, ‘శతమానంభవతి’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకొని తెలుగులో దూసుకెళుతోంది.
సినిమాల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకునే ఈ అమ్మడు గ్లామర్‌ పాత్రలకు చాలా దూరంగా ఉంటూ వస్తోంది. కెరీర్‌ తొలినాళ్ల నుంచి తనకు తాను కొన్ని హద్దులు పెట్టుకొని సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం మలయాళంతో పాటు తమిళంలో నటిస్తోంది. ఇక సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది అను. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే అనుపమ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత నడుమ నడుస్తూ వెళ్తోన్న ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో పక్షుల కిలకిల రావాలు వినిపిస్తుండగా.. నులు వెచ్చని సూర్య కిరణాలు తనపై పడుతుండగా.. నవ్వులు చిందిస్తోంది అనుపమ. ఇక ఈ వీడియోలో అనుపమ పలికించిన హావభావాలు నెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి. అనుపమ పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను లక్షల మంది వీక్షించడం విశేషం. మరి అనుపమ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో..

Also Read: Raashi Khanna : కెరియర్ పై క్లారిటీతో ఉన్న రాశిఖన్నా.. మంచిరోజులొస్తాయని నమ్మకంతో ఉన్నానంటున్న ముద్దుగుమ్మ..