బీజాపూర్ అటవీ ప్రాంతంలో కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్, సయాబో కాల్చివేత తర్వాత గాలింపు మరింత తీవ్రతరం

|

Jan 17, 2021 | 11:55 AM

Anti-Naxal operation : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ అటవీప్రాంతంలో మావోల కోసం కూంబింగ్ ఉధృతంగా కొనసాగుతోంది. నిన్నటి సెర్చ్...

బీజాపూర్ అటవీ ప్రాంతంలో కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్, సయాబో కాల్చివేత తర్వాత గాలింపు మరింత తీవ్రతరం
Follow us on

Anti-Naxal operation : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ అటవీప్రాంతంలో మావోల కోసం కూంబింగ్ ఉధృతంగా కొనసాగుతోంది. నిన్నటి సెర్చ్ ఆపరేషన్‌‌కు కొనసాగింపుగా.. తప్పించుకున్న మావోయిస్టుల కోసం వెతుకులాట మొదలెట్టాయి భద్రతా దళాలు. కుటురూ జిల్లా అటవీ ప్రాంతంలో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ తీవ్రంగా గాలిస్తున్నాయి. శనివారం పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్ట్ సయాబో అలియాస్ రాణోకు పోస్ట్ మార్టమ్ నిర్వహించి డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు పోలీసులు. సైబో పై 8 లక్షల రివార్డ్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా, పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన సయాబో .. మావోయిస్ట్ ఫార్సిగడ్ యాక్షమ్ టీం కమాండర్, ఫార్సిగడ్ స్పెషల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ డిప్యూటీ కమాండర్ గా పనిచేశాడు.