ఎరిక్సన్‌కు బాకీ మొత్తాన్ని చెల్లించిన ఆర్‌కామ్

|

Mar 18, 2019 | 8:27 PM

డిల్లీ: రిలయన్స్ కమ్యునికేషన్‌(ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీకు ఊరట లభించింది. స్వీడన్ టెలికం కంపెనీ ఎరిక్సన్‌కు ఇవ్వాల్సిన రూ.462 కోట్ల బకాయిలను అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) చెల్లించేసింది. సుప్రీం కోర్టు విధించిన మార్చి 19 గడువులోగానే మొత్తాన్ని చెల్లించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ చెల్లింపుల్లో ఆలస్యం జరిగినట్లయితే ఆయన మూడు నెలలు కారాగార అనుభవించాల్సి వచ్చేది. దీంతో రెండు కంపెనీల మధ్య సంవత్సర కాలంగా కొనసాగుతోన్న న్యాయపోరాటానికి తెరపడిందని సమాచారం. […]

ఎరిక్సన్‌కు బాకీ మొత్తాన్ని చెల్లించిన ఆర్‌కామ్
Follow us on

డిల్లీ: రిలయన్స్ కమ్యునికేషన్‌(ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీకు ఊరట లభించింది. స్వీడన్ టెలికం కంపెనీ ఎరిక్సన్‌కు ఇవ్వాల్సిన రూ.462 కోట్ల బకాయిలను అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) చెల్లించేసింది. సుప్రీం కోర్టు విధించిన మార్చి 19 గడువులోగానే మొత్తాన్ని చెల్లించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ చెల్లింపుల్లో ఆలస్యం జరిగినట్లయితే ఆయన మూడు నెలలు కారాగార అనుభవించాల్సి వచ్చేది. దీంతో రెండు కంపెనీల మధ్య సంవత్సర కాలంగా కొనసాగుతోన్న న్యాయపోరాటానికి తెరపడిందని సమాచారం.

ఎరిక్సన్‌కు చెల్లింపుల విషయంలో ఆర్‌కామ్ కోర్టు ధిక్కారానికి పాల్పడిందని సుప్రీం నిర్ధరించి, అనిల్‌ అంబానీకి రూ. కోటి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిని చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంది. అలాగే ఎరిక్సన్‌కు నాలుగు వారాల్లోగా బకాయిలు చెల్లించాలనీ.. లేకుంటే కోర్టు ధిక్కారం కింద మూడు నెలలు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని అనిల్ అంబానీ సహా ఆర్‌కామ్‌కి చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లను సుప్రీంకోర్టు గత నెలలో ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ గడువు రేపటితో ముగియ నుండడం, నేటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సరిగ్గా సుప్రీంకోర్టు గడువుకు ఒక్కరోజు ముందు ఆర్‌కామ్ కంపెనీ అప్పు పూర్తిగా చెల్లించడం గమనార్హం. ఎరిక్సన్‌కు ఆర్‌కాం మొత్తం రూ.571 కోట్లు బకాయిపడింది. ఇందులో వన్‌టైం సెటిల్‌మెంట్‌గా రూ.550 కోట్లు .. మరో రూ.21 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఆర్‌కామ్ సంస్థ ఎరిక్సన్‌కు ఇంతకు ముందే రూ.118 కోట్లు చెల్లించించింది.