ఏపీ విద్యుత్ శాఖ కీల‌క నిర్ణ‌యం…బిల్లు చెల్లించకున్నా..!

|

Apr 18, 2020 | 9:01 AM

కరోనా వ్యాప్తి క‌ట్ట‌డి చ‌ర్య‌ల భాగంగా లాక్ డౌన్ విధించడంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్ శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గృహ, పారిశ్రామిక విద్యుత్తు వినియోగదారులు ఏప్రిల్‌లో చెల్లించాల్సిన బిల్లు చెల్లించకున్నా సరఫరా నిలిపేయకూడదని నిర్ణయించింది. మాములుగా అయితే బిల్లు జారీ చేసినప్పటి నుంచి 14 రోజుల్లో న‌గ‌దు చెల్లింపులు జ‌రిపేయాలి. పేమెంట్స్ లో ఏమైనా లేటు చేస్తే.. రీకనెక్షన్‌ ఛార్జీలను వసూలు చేస్తారు. వాయిదా ముగిసిన‌ వారం రోజుల […]

ఏపీ విద్యుత్ శాఖ కీల‌క నిర్ణ‌యం...బిల్లు చెల్లించకున్నా..!
Follow us on

కరోనా వ్యాప్తి క‌ట్ట‌డి చ‌ర్య‌ల భాగంగా లాక్ డౌన్ విధించడంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్ శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గృహ, పారిశ్రామిక విద్యుత్తు వినియోగదారులు ఏప్రిల్‌లో చెల్లించాల్సిన బిల్లు చెల్లించకున్నా సరఫరా నిలిపేయకూడదని నిర్ణయించింది.

మాములుగా అయితే బిల్లు జారీ చేసినప్పటి నుంచి 14 రోజుల్లో న‌గ‌దు చెల్లింపులు జ‌రిపేయాలి. పేమెంట్స్ లో ఏమైనా లేటు చేస్తే.. రీకనెక్షన్‌ ఛార్జీలను వసూలు చేస్తారు. వాయిదా ముగిసిన‌ వారం రోజుల తర్వాత ప‌వ‌ర్ సప్లైను నిలిపివేస్తారు. ప్ర‌స్తుతం కరోనా నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ ఈ రూల్స్ స‌డలించింది. కరెంటు బిల్లుల‌ను ఆలస్యంగా చెల్లించిన వినియోగదారుల నుంచి రీకనెక్షన్‌ ఛార్జీలు(జరిమానా) వసూలు చేయకూడదని అధికారులు భావిస్తున్నారు. దీనిపై అఫిషియ‌ల్ గా నిర్ణయం తీసుకోవాల్సి ఉదని ఒక అధికారి తెలిపారు.