రైతుల‌కు మేలు..ప్ర‌జ‌ల‌కు బాగు…జ‌గ‌న్ స‌ర్కార్ క్రేజీ ఐడియా

|

Apr 18, 2020 | 12:54 PM

లాక్‌డౌన్ వేళ ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు ఏపీ స‌ర్కార్ కీల‌క చ‌ర్య‌లు తీసుకుంటుంది. మ‌రోవైపు ఏపీకి వెన్నుముక అయిన రైతుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు అస్త్ర‌శ‌స్త్రాలు సిద్దం చేస్తోంది. తాజాగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి పండ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రైతుల వ‌ద్ద నుంచి పండ్ల‌ను కొని..వాటిని రైతు మార్కెట్ల ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరలకే పంపిణీ చేయాల‌ని భావిస్తోంది. కర్నూలు, క‌డ‌ప‌ జిల్లాల్లో ఇందుకు సంబంధించిన ప‌నులు ప్రారంభించింది. రూ.100కే […]

రైతుల‌కు మేలు..ప్ర‌జ‌ల‌కు బాగు...జ‌గ‌న్ స‌ర్కార్ క్రేజీ ఐడియా
Follow us on

లాక్‌డౌన్ వేళ ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు ఏపీ స‌ర్కార్ కీల‌క చ‌ర్య‌లు తీసుకుంటుంది. మ‌రోవైపు ఏపీకి వెన్నుముక అయిన రైతుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు అస్త్ర‌శ‌స్త్రాలు సిద్దం చేస్తోంది. తాజాగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి పండ్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రైతుల వ‌ద్ద నుంచి పండ్ల‌ను కొని..వాటిని రైతు మార్కెట్ల ద్వారా ప్రజలకు అతి తక్కువ ధరలకే పంపిణీ చేయాల‌ని భావిస్తోంది. కర్నూలు, క‌డ‌ప‌ జిల్లాల్లో ఇందుకు సంబంధించిన ప‌నులు ప్రారంభించింది. రూ.100కే 5 రకాల పండ్లు( 8 అరటి పండ్లు, 5 స్వీట్ ఆరెంజ్, ఒక కర్బుజా, బొప్పాయి, 5 నిమ్మకాయలు) అందజేస్తోంది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రెడ్ జోన్ల‌లో ఈ మేర‌కు పంపిణీ ప్రారంభించారు. అటు రైతులు పంట‌లు నష్టపోకుండా.. ఇటు కరోనో సమయంలో ప్ర‌జ‌లు రోగ నిరోధక శక్తి పెంచుకునేలా జ‌గ‌న్ స‌ర్కార్ ఈ క్రేజీ ఐడియాతో ముందుకొచ్చింది.