ఏపీకి మరిన్ని కావాలి.. కేంద్రమంత్రికి జగన్ లేఖ

|

Jun 11, 2020 | 1:04 PM

వందే భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న ప్రత్యేక విమానాల వ్యవస్థపై ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. వందేభారత్‌ను అభినందిస్తూ ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జయశంకర్‌కు గురువారం లేఖ రాశారు.

ఏపీకి మరిన్ని కావాలి.. కేంద్రమంత్రికి జగన్ లేఖ
Follow us on

వందే భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న ప్రత్యేక విమానాల వ్యవస్థపై ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. వందేభారత్‌ను అభినందిస్తూ ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జయశంకర్‌కు గురువారం లేఖ రాశారు. అయితే ప్రవాసాంధ్రులను తమ రాష్ట్రానికి తరలించేందుకు సరిపడా విమానాలను ఏపీకి కేటాయించలేదని సీఎం అభిప్రాయపడ్డారు. ఏపీకి మరిన్ని వందే భారత్ విమానాలను కేటాయించాలని ముఖ్యమంత్రి తన లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

వివిధ దేశాల్లో ఉన్న తెలుగు అసోసియేషన్‌లు చార్టెడ్ విమానాలను అనుమతించాలని కోరుతున్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. చార్టెడ్ విమానాలను, వందే భారత్ మిషన్ విమానాలను అనుమతించేదుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వందే భారత్ మిషన్‌లో ఏపీకి మరిన్ని విమానాలను కేటాయించడంతో పాటు చార్టెడ్ విమానాలను అనుమతించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక క్వారెంటైన్ వసతులను కల్పించేందుకు, వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు.

Read Jagan letter here:  Vande Bharat-Flights- Lr HCM to Min External Affairs.pdf.pdf