ఏపీలో రేప‌ట్నుంచి లాక్‌డౌన్ మినహాయింపులు ఇవే…

|

Apr 19, 2020 | 11:33 AM

ఎక్కువ‌గా వ్య‌వ‌సాయ ఆధారిత రాష్ట్రం, ఆర్థిక లోటు ఉండ‌టంతో ఏపీ స‌ర్కార్ మొద‌ట్నుంచి అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ కు వ్య‌తిరేకంగా త‌న వాణిని వినిపిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం ఏప్రిల్ 20 నుంచి కొన్ని స‌డ‌లింపులు క‌ల్పించడంతో..ఏపీ స‌ర్కార్ కూలంక‌షంగా చ‌ర్చించిన‌ అనంత‌రం ..కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేసింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ నుంచి మినహాయింపులు లభించనున్నాయి. అయితే ఆ ప్రాంతాల‌లో కూడా మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక‌దూరం పాటించ‌డం వంటివి […]

ఏపీలో రేప‌ట్నుంచి లాక్‌డౌన్ మినహాయింపులు ఇవే...
Follow us on

ఎక్కువ‌గా వ్య‌వ‌సాయ ఆధారిత రాష్ట్రం, ఆర్థిక లోటు ఉండ‌టంతో ఏపీ స‌ర్కార్ మొద‌ట్నుంచి అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ కు వ్య‌తిరేకంగా త‌న వాణిని వినిపిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం ఏప్రిల్ 20 నుంచి కొన్ని స‌డ‌లింపులు క‌ల్పించడంతో..ఏపీ స‌ర్కార్ కూలంక‌షంగా చ‌ర్చించిన‌ అనంత‌రం ..కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేసింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ నుంచి మినహాయింపులు లభించనున్నాయి. అయితే ఆ ప్రాంతాల‌లో కూడా మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక‌దూరం పాటించ‌డం వంటివి తప్ప‌నిస‌రిగా పాటించాల్సి ఉంటుంది.

  • లాక్‌డౌన్ ఆంక్షలను పరిశ్రమల కోసం సడలింపు
  • రైస్, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తుల పరిశ్రమలకు మినహాయింపు
  • సబ్బులు తయారీ కంపెనీలు, ఔష‌ద త‌యారీ సంస్థ‌లు, మాస్కులు, బాడీ సూట్ల తయారీ సంస్థలకు మినహాయింపు
  • కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిబంధనలకు అనుగుణంగా స‌డ‌లింపులు
  • కోల్డ్ స్టోరేజీలు, ఆగ్రో ఇండ‌స్ట్రీస్, బేకరీ, చాక్లెట్ల తయారీ పరిశ్రమలకు మినహాయింపు
  • అమెజాన్, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ కార్యకలాపాలకు స‌డ‌లింపు
  • ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు మినహాయింపు
  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు పనిచేసేందుకు అవకాశం
  • ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలకు మినహాయింపు

 

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టు పనులు, భవన నిర్మాణాలకు.. ఐటీ సంస్థల్లో 50శాతం ఉద్యోగులతో పనులకు, అన్ని రకాల వస్తు రవాణాకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. వాహనాల మరమ్మతు కేంద్రాలు, జాతీయ రహదారి పక్కన దాబాలను నిబంధనల మేరకు నిర్వహించుకోవచ్చు. 30 నుంచి 40శాతం రవాణా సామర్థ్యంతో వాహనాల్లోనే ఉద్యోగులను తరలించాలని చెప్పింది ప్రభుత్వం. అయితే ఆయా సంస్థలన్నీ వారి ప్రాథమిక సమాచారంతో నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేర‌కు ఉత్తర్వులను కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమలశాఖ, రవాణా, కార్మిక శాఖ అధికారులకు పంపింది ప్రభుత్వం.