డాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

|

Jun 05, 2020 | 12:27 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సంచలనంగా మారిన విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో మ‌రో మ‌లుపు చోటుచేసు‌కుంది. సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు..కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

డాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సంచలనంగా మారిన విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో మ‌రో మ‌లుపు చోటుచేసు‌కుంది. సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు..కీల‌క ఆదేశాలు జారీ చేసింది. మెంట‌ల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప‌ర్మిష‌న్ తో సుధాకర్ డిశ్చార్జ్ కావొచ్చని హైకోర్టు తెలిపింది. అయితే సీబీఐ విచారణకు సుధాకర్‌ను సహకరించాలని ఆదేశించింది.

డాక్ట‌ర్ సుధాకర్‌ను అన్యాయంగా కస్టడీలోకి తీసుకున్నారని.. 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలంటూ అత‌డి త‌ల్లి ‌‌ గురువారం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపైనే కోర్టు పై విధంగా స్పందించింది. మరోవైపు తనను విశాఖ మాన‌సిక వైద్య‌శాల‌ నుంచి మరో ఆస్పత్రికి తరలించాలని డాక్టర్‌ సుధాకర్‌ వేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ ను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.