ఏపీ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌…ప్రైవేటు డిగ్రీ కాలేజీలన్నింటికీ సేమ్ ఫీజు..!

|

Jun 10, 2020 | 11:05 PM

ఏపీ సీఎం జ‌గ‌న్ విద్యా వ్య‌వ‌స్థ‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. ప‌లు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్ప‌టికే ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న జ‌గ‌న్.. ఈ అక‌డ‌మిక్ ఇయ‌ర్ (2020-21) నుంచి ప్రయివేటు డిగ్రీ క‌ళాశాల‌ల్లో ఒకే తరహా ఫీజు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఏపీ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌...ప్రైవేటు డిగ్రీ కాలేజీలన్నింటికీ సేమ్ ఫీజు..!
Follow us on

ఏపీ సీఎం జ‌గ‌న్ విద్యా వ్య‌వ‌స్థ‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. ప‌లు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్ప‌టికే ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న జ‌గ‌న్.. ఈ అక‌డ‌మిక్ ఇయ‌ర్ (2020-21) నుంచి ప్రవేటు డిగ్రీ క‌ళాశాల‌ల్లో ఒకే తరహా ఫీజు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న‌ట్టు స‌మాచారం. 2020-21 అక‌డ‌మిక్ ఇయ‌ర్ నుంచి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులను ఫైన‌ల్ చేసేందుకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రెడీ అవుతుంది. రెగ్యూల‌ర్ డిగ్రీ కోర్సుల‌కు ప‌లు కాలేజీలు వ‌సూలు చేస్తోన్న ఫీజుల్లో ఎక్కువ వ్య‌త్యాసాలు ఉన్న నేప‌థ్యంలో విద్యార్థుల‌కు మేలు చేకూర్చేలా.. కమిషన్‌ ఏకరూప ఫీజు ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మ‌రో 10 రోజుల వ్య‌వధిలోనే కొత్త ఫీజుల నిర్ణయ ప్రక్రియను కమిషన్ కంప్లీట్ చేయనుంది. ఏపీలో మొత్తం 1,441 డిగ్రీ కాలేజీలు ఉండ‌గా.. వీటిలో 1,153 ప్రైవేట్‌ అన్ ‌ఎయిడెడ్‌ కాలేజీలు, 137 ఎయిడెడ్‌ కాలేజీలు, 151 గవ‌ర్న‌మెంట్ కాలేజీలు ఉన్నాయి. ఎయిడెడ్‌, గ‌వ‌ర్న‌మెంట్ కాలేజీలకు కళాశాల విద్య కమిషనరేట్ ‌(సీసీఈ) ఫీజులను నిర్ణయిస్తుంది. ప్రవేట్‌ అన్ ‌ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలకు మాత్రం మొద‌టిసారిగా ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ ఫీజులను ఫైన‌ల్ చేయ‌నుంది. ఒకే విధానంలో ఫీజు ఎలా ఉండాలన్న దానిపై రెండు ఆప్ష‌న్స్ పరిశీలనలో ఉన్నాయని అధికార వ‌ర్గాల స‌మాచారం. రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు ఒకే విధ‌మైన‌ ఫీజును నిర్ణయించడం. లేదా.. క‌ళాశాల‌ల‌ను రెండు లేదా మూడు కేటగిరీలుగా వ‌ర్గీక‌రించి ఫీజులను నిర్ణయించడం. వీటిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.