ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. చేయూత ప‌థ‌కం దరఖాస్తు గడువు పెంపు

|

Jul 18, 2020 | 7:37 AM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.సంచ‌లనాత్మ‌క‌ వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి అప్లై చేసేందుకు మరో ఐదు రోజులు గడువు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. చేయూత ప‌థ‌కం దరఖాస్తు గడువు పెంపు
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంచ‌లనాత్మ‌క‌ వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి అప్లై చేసేందుకు మరో ఐదు రోజులు గడువు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. పింఛన్ తీసుకుంటున్న‌వారికి కూడా చేయూత స్కీమ్ ద్వారా సాయం అందిచాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించ‌డంతో… ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. అర్హత ఉండి ఇప్పటి వరకు ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

వైఎస్సార్ చేయూత పథకం అమలు చేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ సంవ‌త్స‌రానికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక తోడ్పాడు అందించ‌నున్నారు. ఇప్పటికే అర్హులు జూన్‌ 28 నుంచి దరఖాస్తులు ఇచ్చారు. గతంలో గ‌వ‌ర్న‌మెంట్ పెన్ష‌న్ అందుకుంటున్న మ‌హిళ‌ల‌కు ఈ ప‌థకం వ‌ర్తించ‌ద‌నే నిబంధ‌న ఉంది. ప్ర‌స్తుతం వారికి కూడా అవ‌కాశం క‌ల్పించారు. ఈ మేర‌కు ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో పింఛ‌న్ తీసుకుంటున్న‌‌ వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేతలు, దివ్యాంగులైన మహిళలు, గీత, మత్స్యకార మహిళలకూ ప్ర‌యోజ‌నం చేకూరనుంది.