ఈ పరికరం గాలిని శుద్ధి చేస్తుందట..!

|

Aug 21, 2020 | 1:27 PM

కలుషితమైన గాలి నుంచి విముక్తి కలిగించేందుకు తెలంగాణ ప్రొఫెసర్ ఓ కొత్త అవిష్కరణను అందుబాటులోకి తీసుకువచ్చారు. గాలిలో వైర్‌సను నిర్మూలించే కొత్త పరికరాన్ని మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ సమీపంలోని బీవీఆర్‌ఐటీ కళాశాల కెమికల్‌ ఇంజనీ రింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ ఆవిష్కరించారు.

ఈ పరికరం గాలిని శుద్ధి చేస్తుందట..!
Follow us on

వాయు కాలుష్యం మితిమీరిపో తోంది. కాలుష్యంపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం, వాయు కాలుష్యంతో ప్రజలు ప్రాణాంతకమైన వ్యాధులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోడ్లపై తిరగాక తప్పని వారు భయాంకరనమైన దీర్ఘకాలిక రోగాలు సంక్రమిస్తున్నాయి. ఇలాంటి కలుషితమైన గాలి నుంచి విముక్తి కలిగించేందుకు తెలంగాణ ప్రొఫెసర్ ఓ కొత్త అవిష్కరణను అందుబాటులోకి తీసుకువచ్చారు.

గాలిలో వైరస్ ను నిర్మూలించే కొత్త పరికరాన్ని మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ సమీపంలోని బీవీఆర్‌ఐటీ కళాశాల కెమికల్‌ ఇంజనీ రింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. గురువారం కళాశాలలో యంత్రం పనితీరును ప్రిన్సిపాల్‌ లక్ష్మీప్రసాద్‌కు ఆయన వివరించారు. గాలిలో ఉండే కరోనా వైరస్ ను   నిర్మూలించడంతోపాటు ఇతర దుమ్ము, ధూళి కణాలను ఈ యంత్రం శుద్ధి చేస్తుందని ఆయన చెబుతున్నారు. నాలుగు దశల్లో ఈ యంత్రం గాలిని శుద్ధి చేస్తుందన్నారు. మొదటి దశలో యూవీ స్టెరిలైజేషన్‌, రెండో దశలో ప్లూడిజేషన్‌ జరుగుతుందని, ఈ రెండు దశల్లో వైరస్ ను యంత్రం నిర్మూలిస్తుందన్నారు. గాలిలోని మలినాలు, కార్బన్‌ డైఆక్సైడ్‌ను మూడు, నాలుగు దశల్లో యంత్రం శుద్ధి చేస్తుందని తెలిపారు. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతానికి రూ.10 వేలలోపు ధరకే ఇది లభిస్తుందని శ్రీనివాస్ తెలిపారు.