ఆర్జీవీకి గుడ్ న్యూస్.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ పూర్తి!

|

Dec 11, 2019 | 7:26 PM

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు గుడ్ న్యూస్ అందించింది. ఆయన తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌ చెప్పగా… సెన్సార్ బోర్డు వాటిని తొలగించి సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే సర్టిఫికెట్ ఇవ్వడంలో కొంత జాప్యత జరగగా.. చిత్ర యూనిట్ ఆందోళన చేయడం జరిగింది. ఇదిలా ఉంటే వర్మ తొలుత ‘కమ్మ రాజ్యంలో కడప […]

ఆర్జీవీకి గుడ్ న్యూస్.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు సెన్సార్ పూర్తి!
Follow us on

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు గుడ్ న్యూస్ అందించింది. ఆయన తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌ చెప్పగా… సెన్సార్ బోర్డు వాటిని తొలగించి సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే సర్టిఫికెట్ ఇవ్వడంలో కొంత జాప్యత జరగగా.. చిత్ర యూనిట్ ఆందోళన చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే వర్మ తొలుత ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించగా.. ఈ మూవీ టైటిల్, సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన స్పందించి.. సినిమా టైటిల్‌ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు. అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా తనను వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఫిర్యాదు చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వెంటనే సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని హైకోర్టును కోరారు. ఇక ఈ కేసును విచారించిన హైకోర్టు రివైజింగ్ కమిటీ చిత్రాన్ని పూర్తిగా చూసి.. సెన్సార్ చేయాలని సూచించింది. ఇక ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించడంతో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.