బీజేపీ నూతన రథసారథి ఎవరు ..?

| Edited By:

Jun 13, 2019 | 1:13 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో నిర్వహిస్తున్న జాతీయ పదాధికారులు, అన్ని రాష్ట్రాల ఇన్‌ఛార్జిలు, అధ్యక్షుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై అమిత్ షా చర్చించే అవకాశం ఉంది. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళిక ఖరారు వంటి అంశాలపై పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా […]

బీజేపీ నూతన రథసారథి ఎవరు ..?
Follow us on

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో నిర్వహిస్తున్న జాతీయ పదాధికారులు, అన్ని రాష్ట్రాల ఇన్‌ఛార్జిలు, అధ్యక్షుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై అమిత్ షా చర్చించే అవకాశం ఉంది. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రణాళిక ఖరారు వంటి అంశాలపై పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన అమిత్ షా స్థానంలో ప్రస్తుతం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.