అమిత్ షాకు వాజ్‌పేయి ఇల్లు

| Edited By:

Jun 07, 2019 | 11:29 AM

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అమిత్ షాకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇంటిని ప్రభుత్వం కేటాయించింది. 6-ఎ కృష్ణమీనన్ మార్గ్‌లో ఉన్న ఈ ఇంటిలో వాజ్‌పేయి తుదిశ్వాస విడిచే వరకు నివసించారు. గతేడాది ఆగస్టు 16న వాజ్‌పేయి కన్నుమూశారు. ప్రస్తుతం అమిత్ షా 11 అక్బర్ రోడ్డులో నివసిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం.. మోదీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా […]

అమిత్ షాకు వాజ్‌పేయి ఇల్లు
Follow us on

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అమిత్ షాకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇంటిని ప్రభుత్వం కేటాయించింది. 6-ఎ కృష్ణమీనన్ మార్గ్‌లో ఉన్న ఈ ఇంటిలో వాజ్‌పేయి తుదిశ్వాస విడిచే వరకు నివసించారు. గతేడాది ఆగస్టు 16న వాజ్‌పేయి కన్నుమూశారు. ప్రస్తుతం అమిత్ షా 11 అక్బర్ రోడ్డులో నివసిస్తున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం.. మోదీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అమిత్ షాను కేబినెట్‌లోకి తీసుకుని.. ఆయనకు హోంమంత్రిత్వ శాఖను కేటాయించారు.