అమెరికా అమ్ముల పొదలో హై-ఎనర్జీ లేజర్ ఆయుధం..!

|

May 25, 2020 | 3:08 PM

ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ సంపతిని కలిగిన అమెరికా మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తన అమ్ముల పొదలో నూతన సాంకేతిక పరిజ్జానంతో రూపొందించిన కొత్త ఆయుధాన్ని చేర్చకుంది. కొత్త హై-ఎనర్జీ లేజర్ ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అత్యాధునిక లేజర్ వెపన్ ను సక్సెస్ ఫుల్ గా టెస్ట్ చేసినట్లు అమెరికా ప్రకటించింది. యూఎస్ నేవీ యుద్ధనౌక.. విమానాలను నాశనం చేయగల కొత్త హై-ఎనర్జీ లేజర్ ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించిందని నేవీ పసిఫిక్ ఫ్లీట్ ఒక ప్రకటనలో […]

అమెరికా అమ్ముల పొదలో హై-ఎనర్జీ లేజర్ ఆయుధం..!
Follow us on

ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ సంపతిని కలిగిన అమెరికా మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తన అమ్ముల పొదలో నూతన సాంకేతిక పరిజ్జానంతో రూపొందించిన కొత్త ఆయుధాన్ని చేర్చకుంది. కొత్త హై-ఎనర్జీ లేజర్ ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించింది.
అత్యాధునిక లేజర్ వెపన్ ను సక్సెస్ ఫుల్ గా టెస్ట్ చేసినట్లు అమెరికా ప్రకటించింది. యూఎస్ నేవీ యుద్ధనౌక.. విమానాలను నాశనం చేయగల కొత్త హై-ఎనర్జీ లేజర్ ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించిందని నేవీ పసిఫిక్ ఫ్లీట్ ఒక ప్రకటనలో తెలిపింది. యూఎస్ పోర్ట్ ల్యాండ్ యుద్ధనౌక నుంచి ‘హై-ఎనర్జీ క్లాస్ సాలిడ్-స్టేట్ లేజర్ ఫస్ట్ ఫేజ్’ పరీక్షలు ఈ నెల 16న నిర్వహించినట్లు తెలిపింది. గాలిలో ఎగురుతున్న డ్రోన్ విమానాన్ని కూల్చిన ఫొటోలు, వీడియో విడుదల చేసింది. లేజర్ ఎనర్జీ కెపాసిటీని దాని సామర్థ్యం గురించి మాత్రం వెల్లడించలేదు. కానీ, ఇది 150 కిలోవాట్ల లేజర్ అని భావిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ రిపోర్టు వెల్లడించింది. దీంతో ఆయుధం కనిపించకుండానే లక్ష్యాన్ని విజయవంతం నాశనం చేయగల సామర్థ్యాన్ని సమకూర్చుకుంది అమెరికా.