అద్భుతాన్ని ఆవిష్కరించిన అమెజాన్.. సెల్ఫ్ డ్రైవింగ్ విద్యుత్ రోబో ట్యాక్సీ రూపకల్పన. గంటకు 120 కి.మీ వేగం దీని సొంతం.

|

Dec 17, 2020 | 8:58 PM

ఈ-కామర్స్ నుంచి మొదలు పెడితే ఎంటర్‌టైన్‌మెంట్ వరకు ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ వస్తోన్న ప్రముఖ కంపెనీ అమెజాన్ తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ (డ్రైవర్ లేకుండా నడిచే) రోబో ట్యాక్సీని రూపొందించింది.

అద్భుతాన్ని ఆవిష్కరించిన అమెజాన్.. సెల్ఫ్ డ్రైవింగ్ విద్యుత్ రోబో ట్యాక్సీ రూపకల్పన. గంటకు 120 కి.మీ వేగం దీని సొంతం.
Follow us on

Amazon’s Zoox Unveils Electric ‘Robo-Taxi: ఈ-కామర్స్ నుంచి మొదలు పెడితే ఎంటర్‌టైన్‌మెంట్ వరకు ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ వస్తోన్న ప్రముఖ కంపెనీ అమెజాన్ తాజాగా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ (డ్రైవర్ లేకుండా నడిచే) రోబో ట్యాక్సీని రూపొందించింది. ఈ ట్యాక్సీ విద్యుత్ సహాయంతో నడవడం విశేషం. అమెజాన్ ఇటీవలే ఈ ప్రాజెక్టును అమెరికా జెయింట్ సంస్థ నుంచి కొనుగోలు చేసి జూక్స్ ప్రాజెక్టు‌గా నామకరణం చేసింది.

ఈ ప్రోటోటైప్ రోబోటిక్ ట్యాక్సీ కారులో నలుగురు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. అత్యంత సాంకేతికతో రూపొందించిన ఈ ట్యాక్సీలో ప్రతీది అద్భుతమే. డ్రైవర్ లేకుండా నడిచే ఈ రోబోటిక్ ట్యాక్సీ ఏకంగా 120 కిలోమీటర్ల దూసుకెళ్లగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థతో తయారైన ఈ ట్యాక్సీ రోడ్డుపై ప్రయాణించేప్పుడు.. ఏవైనా ఆటంకాలు ఉంటే ముందుగానే గుర్తుపట్టగలదు. 133 కిలోవాట్ల బ్యాటరీతో 16 గంటల ఏకధాటిగా ప్రయాణించడం దీని మరో ప్రత్యేకత. ఈ ట్యాక్సీ ప్రయాణిస్తున్న 150 మీటర్ల వైశాల్యంలో వివిధ కోణాల్లో పరిస్థితులను తెలుసుకునేలా 360 డిగ్రీల వ్యూతో పరిశీలించేందుకు లిడార్‌ టెక్నాలజీతో కూడిన పలు కెమెరాలను, రాడార్లను ఇందులో అమర్చారు. ప్రస్తుతం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌వెగాస్‌లలో దీన్ని ప‌రీక్షిస్తున్నారు.