Amazon Ultra HD 4K Smart TV: మార్కెట్‌లోకి అమేజాన్ అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్‌టీవీలు.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

|

Jan 01, 2021 | 1:59 PM

Amazon Ultra HD 4K Smart TV: కొత్త సంవత్సరం ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకుంటున్న ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా

Amazon Ultra HD 4K Smart TV: మార్కెట్‌లోకి అమేజాన్ అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్‌టీవీలు.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Follow us on

Amazon Ultra HD 4K Smart TV: కొత్త సంవత్సరం ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకుంటున్న ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా స్మార్ట్‌ టీవీల‌ను విడుద‌ల చేసింది. అమేజాన్ టెలివిజన్ల ధ‌ర‌లు రూ.29,999 నుంచి ప్రారంభ‌మ‌వుతున్నాయి. 50 మరియు 55 అంగుళాల రెండు సైజు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ బేసిక్స్ ఫైర్ టివి ఎడిషన్ టెలివిజన్లలో 4కె హెచ్‌డిఆర్ ఎల్ఈడీ ప్యానెల్స్‌ ఉన్నాయి, డాల్బీ విజన్ మరియు హెచ్‌డిఆర్, ఆడియో కోసం డాల్బీ అట్మోస్ వంటి ఫార్మాట్‌లకు స‌పోర్ట్ ఇస్తాయి. ఎంట్రీ లెవల్ 4కె స్మార్ట్ టివి విభాగంలో ప్రధానంగా షియోమి, టిసిఎల్, హిస్సెన్స్, వీయూ వంటి బ్రాండ్ల టెలివిజన్లకు ఇవి పోటీ ఇస్తాయి. అమేజాన్ టెలివిజ‌న్లకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ టీవీలు‌, అమెజాన్‌కు చెందిన ఫైర్ టివి ఆప‌రేటింగ్ సిస్టంతో న‌డుస్తాయి. అమేజాన్ ఫైర్ టీవీ ఆప‌రేటింగ్ సిస్టంను ఫైర్ టివి స్టిక్ శ్రేణి స్ట్రీమింగ్ పరికరాలతో పాటు ఒనిడా మరియు అకాయ్ వంటి ఇతర బ్రాండ్ల టీవీల్లో గ‌మ‌చించ‌వ‌చ్చు. మీరు అమెజాన్ ఓఎస్ వద్దనుకుంటే మీ సొంత సెట్ టాప్ బాక్స్‌ను కూడా కనెక్ట్ చేసుకోవ‌చ్చు. ఈ టీవీల్లో అమెజాన్ యొక్క వాయిస్ అసిస్టెంట్, అలెక్సాను కూడా ఉపయోగించవచ్చు, అవి సినిమాలు, సంగీతం లేదా టీవీ షోల ప్లే కోసం క‌మాండ్ ఇవ్వొచ్చు. సమాచారాన్ని కూడా పొందే వెసులుబాటు కూడా ఉంటుంది.