అమేజాన్ ఆన్‌లైన్ షాపింగ్ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతోందా తెలుసా..? లెక్కలు తెలిస్తే షాక్ కావాల్సిందే.

|

Dec 18, 2020 | 4:40 PM

మనం బుక్ చేయగానే ఇంటికి వస్తోన్న అమేజాన్ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అమేజాన్ వల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఏంటనేగా మీ సందేహం.

అమేజాన్ ఆన్‌లైన్ షాపింగ్ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతోందా తెలుసా..? లెక్కలు తెలిస్తే షాక్ కావాల్సిందే.
Follow us on

amazon plastic packaging effects environment: ఏ చిన్న వస్తువు కొనాలనే ఆలోచనా వచ్చినా సరే వెంటనే వచ్చే సమాధానం ‘అమేజాన్‌లో బుక్ చేసేయ్’. ఆన్‌లైన్ షాపింగ్ అంతలా మనలో భాగమైపోయింది. అయితే మనం బుక్ చేయగానే ఇంటికి వస్తోన్న అమేజాన్ వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అమేజాన్ వల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఏంటనేగా మీ సందేహం. వస్తువులను ప్యాకింగ్ చేయడానికి అమేజాన్ ఉపయోగిస్తున్న ప్లాస్లిక్ కారణంగా ఏడాదికి ఏకంగా 10వేల టన్నుల చెత్త పేరుకుపోతోందని ఓ అంచనా.
దీని ద్వారా నీరు, సముద్రంలో జీవులకు తీరని నష్టం జరుగుతోందని పర్యావరణ వేత్తలు వాదిస్తున్నారు. 2019లో అమేజాన్ ప్యాకింగ్‌లతో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాన్ని అంతా కలపితే భూమిని 500 సార్లు చుట్టి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కేవలం నివేదికలు మాత్రమే కాదు అమేజాన్ కస్టమర్లు కూడా ఈ వాదనతో ఏకీభవించడం విశేషం. యూకే, అమెరికా, కెనాడాలోని అమేజాన్ వినియోగదారులు ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ కావాలని కోరుకుంటున్నారు. మరి ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌లైన్ సంస్థగా అవతరించిన అమేజాన్ ఈ దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాలి.