సంక్రాంతి స్పెషల్ బంపర్ ఆఫర్స్.. స్మార్ట్ ఫోన్లపై పండగ సీజన్‌లో అమెజాన్ డిస్కౌంట్లు

|

Jan 11, 2021 | 5:22 AM

పొంగల్ పండుగకి వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ కామర్స్ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

సంక్రాంతి స్పెషల్ బంపర్ ఆఫర్స్..  స్మార్ట్ ఫోన్లపై పండగ సీజన్‌లో అమెజాన్ డిస్కౌంట్లు
Follow us on

కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలకు పండుగ సీజన్‌లో సొమ్ము చేసుకునేందుకు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సంక్రాంతి, పొంగల్ పండుగకి వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ కామర్స్ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ-కామ‌ర్స్ దిగ్గజం అమెజాన్ సంక్రాంతి పండుగ సందర్భంగా సరికొత్త ఆఫర్స్‌తో ముందుకు వచ్చింది. కొత్త సంవత్సరంలో తొలి ఆఫ‌ర్ల సీజ‌న్ మొద‌లుపెట్టింది. పొంగ‌ల్ షాపింగ్ స్టోర్ పేరుతో అమెజాన్.. ఎల‌క్ట్రానిక్స్‌, స్మార్ట్ ఫోన్లు, విడి భాగాలు త‌దిత‌రాల‌పై ఆఫ‌ర్‌లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ మొబైల్ కంపెనీలు షియోమీ, వ‌న్ ఫ్లస్ , లెనోవా, సామ్‌సంగ్ త‌దిత‌ర కంపెనీ ఉప్పత్తుల కొనుగోలుపై భారీ ఆఫర్లను ప్రకటించింది.

రెడ్ మీ 9 ప‌వ‌ర్ ఫోన్ అమెజాన్‌లో రూ.10,999, సామ్‌సంగ్ ఎం51 రూ.22,999, వ‌న్ ఫ్లస్ నోట్ 5జీ ఫోన్ రూ.27,999ల‌కు అందిస్తోంది. డెల్ ఇన్‌స్పిరోన్ లాప్ టాప్ రూ.27,99, హెచ్పీ 14 ఆల్ట్రా రూ.35,990, లెనోవా ఐడియా ప్యాడ్ ఎస్ 145 రూ.30,990ల‌కు వినియోగ‌దారుల‌కు సొంతం కానున్నాయి. అమాజ్‌ఫిట్ జీటీఎస్ 2 మినీ సూప‌ర్ లైట్ స్మార్ట్ వాచ్ రూ.6,999, మీ స్మార్ట్ బాండ్‌5 వాచ్ ధ‌ర రూ.2,499, సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్‌3 ధ‌ర రూ.32,990లుగా నిర్ధారించింది.

స్మార్ట్ టీవీల విభాగంలో ఎంఐ టీవీ రూ.22,499, వ‌న్ ఫ్లాస్ వై సిరీస్ 80 సీఎం (32 అంగుళాల‌) హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 32వై1 బ్లాక్ రూ. 13,999, సోనీ బ్రేవియా 108 సీఎం ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ కేడీఎల్ ధ‌ర రూ.34,990ల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ల అన్నీ సంక్రాంతి వరకు మాత్రమే ఉంటాయని పేర్కొంది.

Alludu Adhurs pre release event: సంక్రాంతి పండుగకు అలరించబోతున్న “అల్లుడు అదుర్స్”.. ఘనంగా ప్రి రిలీజ్ ఈవెంట్