Benefits of Betel Leaves:పూజ నుంచి పెళ్లి వరకూ ఉపయోగించే తమలపాకు సేవనంతో కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..!

|

Jan 27, 2021 | 6:29 PM

తమలపాకును భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే కాదు శుభకార్యాల్లో కూడా తమలపాకుకు విశిష్ట స్తానం ఇస్తారు. ఇక ఆకు వక్క సున్నం కలిపి చేసే కిళ్లీ భోజనం..

Benefits of Betel Leaves:పూజ నుంచి పెళ్లి వరకూ ఉపయోగించే తమలపాకు సేవనంతో కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..!
Follow us on

Benefits of Betel Leaves: తమలపాకును భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే కాదు శుభకార్యాల్లో కూడా తమలపాకుకు విశిష్ట స్తానం ఇస్తారు. ఇక ఆకు వక్క సున్నం కలిపి చేసే కిళ్లీ భోజనం అనంతరం పసందు చేస్తుంది. పూజ నుంచి పెళ్లి వరకూ మన సంస్కృతిలో భాగమైన తమలపాకు ఆరోగ్యానికి మంచిదని ఈ విషయం ఆయుర్వేదంలో కూడా ఉందనే సంగతి కొంత మందికే తెలుసు..

తలనొప్పి నుంచి అరుగుదల వరకూ మనం రోజువారీ ఎదుర్కొనే చాలా సమస్యలకు తమలపాకుతో చె‌క్ పెట్టొచ్చు. తమలపాకుల సేవనంతో ఉపయోగమేమిటో తెలుసుకుందాం. మన పూర్వీకులు తమలపాకులను నాగవల్లిగా పిలుస్తూ.. విరివిగా వాడేవారు. అయితే ఈ కాలంలో ఆకు వక్కమాటే వినిపించడం లేదు. ఎందుకంటే కొన్ని అపోహల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని దీనికి భయపడి చాలామంది పాన్ తినడాన్ని తగ్గించారు.

ఈ ఆకులో విటమిన్-సీ తో పాటు కాల్షియం అదికంగా ఉంటుంది. తమలపాకులో శరీరానికి కావాల్సిన నిరోధక వ్యవస్థను కాపాడే అనేక ఔషద గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు క్యాన్సర్ నిరోధక, డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలు అదికంగా కలవు. ఇక రక్తపోటు నివారణలో ఈ తమలపాకులు ఎంతో బాగా తోడ్పడుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు చెప్పారు. లేతగా ఉండే తమలపాకులను కాసేపు నుదుటిపై పెట్టుకోండి. ఆటోమేటిక్ గా మీ తలనొప్పి తగ్గిపోతుంది.
చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.

ఉదర సంబంధిత రుగ్మతలను తమలపాకు తొలగిస్తుంది. మూడు గ్లాసుల నీటిలో 15 తమలపాకులను వేసి, నీరు సగం అయ్యేవరకూ బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి, తేనె కలిపి తాగితే దగ్గు నుండి ఉపశమనం పొందుతారు. శరీర, జీర్ణ సంబంధిత సమస్యలు, మానసికంగా ఒత్తిడిని తగ్గించడంలో ఇవి చాలా ఉపయోగం అందుకే చాలా మంది అన్నం తిన్నతరువాత పాన్ వేసుకోవడం మన సాంప్రదాయంగా ఉండేది. . కానీ కేవలం తమలపాకులు మాత్రమే హానికరమైన ప్రభావాలను తెస్తున్నట్టు ఎక్కడా వెల్లడవలేదు. పైగా ఆయుర్వేద గ్రంథాల్లో తమలపాకు తినే విషయంలో వివిధ పద్ధతులు రాసి ఉండటం విశేషం. అయితే దీనితో పాటు నోటి క్యాన్సర్ కు సంబంధించిన ఆందోళనలు కొట్టిపాడేయ్యలేము. తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనినీ పరిమితంగానే వాడుకోవాలి.

Also Read: అధికారిక నివాసంలో పెద్దన్న మార్పులు.. మూన్ రాక్‌పై మనసుపడ్డ పెద్దన్న జో బైడెన్