అమర్ నాథ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి

| Edited By: Pardhasaradhi Peri

Jun 29, 2019 | 11:32 AM

అమర్ నాథ్ యాత్రకు జమ్ము అధికారులు సర్వం సిద్ధం చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్ నాథ్ యాత్ర జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు చేపట్టారు. జూలై 1న ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్ర 40 రోజుల పాటు కొనసాగనుంది. యాత్ర సజావుగా జరిగేలా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. అమర్​నాథ్​కు చేరుకునేందుకు వినియోగించే బల్టాల్​​, పహల్గమ్​ ప్రాంతాల్లో […]

అమర్ నాథ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి
Follow us on

అమర్ నాథ్ యాత్రకు జమ్ము అధికారులు సర్వం సిద్ధం చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్ నాథ్ యాత్ర జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు చేపట్టారు. జూలై 1న ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్ర 40 రోజుల పాటు కొనసాగనుంది. యాత్ర సజావుగా జరిగేలా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు.

అమర్​నాథ్​కు చేరుకునేందుకు వినియోగించే బల్టాల్​​, పహల్గమ్​ ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతికతతో భద్రతను ఏర్పాటు చేసినట్లు జమ్ము పోలీసులు స్పష్టం చేశారు. యాత్ర సమయంలో బల్టాల్​ ప్రాంతానిక ఉగ్రముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో భద్రతను మరింత పెంచారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యాత్రకు సంబంధించిన ఎన్నో సమీక్షలు నిర్వహించింది.