జూలై 21 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర.. 15 రోజులకు కుదింపు..

| Edited By:

Jun 26, 2020 | 7:03 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సారి అమర్‌నాథ్‌ యాత్రపై కరోనా ప్రభావం పడింది. కరోనా నేపథ్యంలో శ్రీఅమర్‌నాథ్‌ బోర్డు

జూలై 21 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర.. 15 రోజులకు కుదింపు..
Follow us on

Amarnath Yatra: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సారి అమర్‌నాథ్‌ యాత్రపై కరోనా ప్రభావం పడింది. కరోనా నేపథ్యంలో శ్రీఅమర్‌నాథ్‌ బోర్డు(ఎస్‌ఏఎ్‌సబీ) పలు నిబంధనలు విధించింది. యాత్రను ఈ సారి 15 రోజులకు కుదించింది. జూలై 21 నుంచి ఆగస్టు 3వ తేదీ రాఖీ పౌర్ణమి వరకు ఈ యాత్ర కొనసాగనున్నది. సాధువులు మినహా ఈ సారి యాత్రకు 55 ఏళ్లలోపు వారికే అనుమతి ఉంటుంది. కరోనా నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి. హెలికాప్టర్‌ సేవలను కూడా అందుబాటులో ఉంచారు. కాగా ఈ సారి అమర్‌నాథ్‌ యాత్రను బాల్టాన్‌ మార్గంలోనే అనుమతిస్తారు. గతంలో పహల్‌గామ్‌ నుంచి కూడా అనుమతి ఉండేది.