ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన అమరావతి రైతులు

| Edited By: Srinu

Feb 04, 2020 | 4:52 PM

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలింపు అంశానికి సంబంధించి…అమరావతి రైతులు, జేఏసీ సభ్యులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. రాష్ట్రం ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవరిస్తుందని వారు వెంకయ్యకు తెలియజేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తుందని..అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని కోసం తడుముకోకుండా భూములిచ్చినందుకు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి కలిసిన అనంతరం రైతులు, ఐకాస సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఇన్ని ఆందోళన చేస్తోన్న […]

ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన అమరావతి రైతులు
Follow us on

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలింపు అంశానికి సంబంధించి…అమరావతి రైతులు, జేఏసీ సభ్యులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. రాష్ట్రం ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవరిస్తుందని వారు వెంకయ్యకు తెలియజేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తుందని..అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని కోసం తడుముకోకుండా భూములిచ్చినందుకు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపరాష్ట్రపతి కలిసిన అనంతరం రైతులు, ఐకాస సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఇన్ని ఆందోళన చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని అందుకే కేంద్ర పెద్దల దృష్టికి రాజధాని అంశాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించేదుకు సర్వశక్తులు ఒడ్డుతామని తెలిపారు. త్వరలోనే కేంద్ర మంత్రులతో పాటు అటు కాంగ్రెస్ పెద్దలను..ఇతర ప్రతిపక్ష నేతలను కూడా కలిసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.