అమరావతి మహిళా రైతుల 300వ రోజు ప్రత్యేక కార్యాచరణ

|

Oct 10, 2020 | 4:06 PM

రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల ఆందోళన రేపటికి 300వ రోజుకు చేరుతుంది. ఈ నేపథ్యంలో అమరావతి మహిళ జేఏసీ ప్రత్యేక నిరసన కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 300 వ రోజు ప్రత్యేక నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి కార్యాచరణ ప్రకటించారు. సుంకర పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీ, లెఫ్ట్, జనసేన, కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు పాల్గొన్నారు. ‘ఆంధ్రుల రాజధాని – సమరభేరి’ అనే పేరు […]

అమరావతి మహిళా రైతుల 300వ రోజు ప్రత్యేక కార్యాచరణ
Follow us on

రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల ఆందోళన రేపటికి 300వ రోజుకు చేరుతుంది. ఈ నేపథ్యంలో అమరావతి మహిళ జేఏసీ ప్రత్యేక నిరసన కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 300 వ రోజు ప్రత్యేక నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి కార్యాచరణ ప్రకటించారు. సుంకర పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీ, లెఫ్ట్, జనసేన, కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు పాల్గొన్నారు. ‘ఆంధ్రుల రాజధాని – సమరభేరి’ అనే పేరు మీద రేపు(ఆదివారం) ఉదయం 9 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ముఖ్యకూడళ్లలో నుండి అమరావతి పరిరక్షణ ర్యాలీ 5 (కి.మీ) మేర నిర్వహిస్తామని మహిళా నేతలు తెలిపారు.

సోమవారం ఉదయం 10గంటల నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల దగ్గర అమరావతి పరిరక్షణ కొరకు నిరసన ప్రదర్శన, నిరసన దీక్ష కార్యకమాలు చేస్తామన్నారు. ప్రజలందరూ మాస్క్ లు ధరించి, సురక్షిత దూరాన్ని పాటిస్తూ, శానిటైజర్స్ వాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మూడు వందల రోజులుగా పోరాటం చేస్తున్నా అమరావతి రైతులను జగన్ ప్రభుత్యం చిన్న చూపు చూస్తూ హేళనగా మాట్లాడుతుందని ఈ సందర్భంలో మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.