సంక్రాంతి రోజు ఉపవాసం..అమరావతి రైతుల నిర్ణయం

| Edited By:

Jan 15, 2020 | 10:47 AM

అమరావతి రైతుల ఉద్యమం ఉధృతం అవుతోంది. ఇప్పటికే పండుగను బహిష్కరించారు ఆ ప్రాంత రైతులు. ఇక సంక్రాంతి రోజు కూడా కాస్త వినూత్నంగా నిరసన తెలుపనున్నారు. అందుకే ముందుగా తలపెట్టిన వంటా వార్పునూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పండుగ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి తమ ఆవేదనను వ్యక్త పరచనున్నట్లు రైతులు పేర్కొన్నారు. సంక్రాంతి అంటే రైతులు సుఖసంతోషాలతో జరుపుకునే పండుగని, కానీ ఇలా రొడ్డెక్కాల్సిరావడం దారుణమన్నారు. ఇక నేడు(బుధవారం) […]

సంక్రాంతి రోజు ఉపవాసం..అమరావతి రైతుల నిర్ణయం
Follow us on

అమరావతి రైతుల ఉద్యమం ఉధృతం అవుతోంది. ఇప్పటికే పండుగను బహిష్కరించారు ఆ ప్రాంత రైతులు. ఇక సంక్రాంతి రోజు కూడా కాస్త వినూత్నంగా నిరసన తెలుపనున్నారు. అందుకే ముందుగా తలపెట్టిన వంటా వార్పునూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పండుగ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి తమ ఆవేదనను వ్యక్త పరచనున్నట్లు రైతులు పేర్కొన్నారు.

సంక్రాంతి అంటే రైతులు సుఖసంతోషాలతో జరుపుకునే పండుగని, కానీ ఇలా రొడ్డెక్కాల్సిరావడం దారుణమన్నారు. ఇక నేడు(బుధవారం) బోగి నేపథ్యంలో బోస్టన్, జీన్ రావ్ కమిటీ రిపోర్టులను మంటల్లో దగ్దం చేశారు రైతులు. ఇంతలా ఆందోళనలు చేస్తోన్నా, ప్రభుత్వం కనీసం స్పందింకపోవడం బాధాకరమన్నారు.