అమరావతి నిరసనల్లో విషాదం..రైతు ఆకస్మిక మరణం

|

Jan 04, 2020 | 10:16 PM

రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమరావతి చుట్టూ ఉన్న 29 గ్రామాల రైతులు సకలజనుల సమ్మె చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నారు. కాగా ఈ రోజు రైతుల ఆందోళనల్లో విషాదం చోటు చేసుకుంది. తుళ్లూరు మండలం దొండపాడుకు చెందిన మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అప్పటి ప్రభుత్వం రాజధాని కోసం చేసిన ల్యాండ్ పూలింగ్‌‌కి సదరు రైతు 10 ఎకరాలు […]

అమరావతి నిరసనల్లో విషాదం..రైతు ఆకస్మిక మరణం
Follow us on

రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమరావతి చుట్టూ ఉన్న 29 గ్రామాల రైతులు సకలజనుల సమ్మె చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నారు. కాగా ఈ రోజు రైతుల ఆందోళనల్లో విషాదం చోటు చేసుకుంది. తుళ్లూరు మండలం దొండపాడుకు చెందిన మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అప్పటి ప్రభుత్వం రాజధాని కోసం చేసిన ల్యాండ్ పూలింగ్‌‌కి సదరు రైతు 10 ఎకరాలు ఇచ్చినట్టు సమాచారం. రాజధాని తమ ప్రాంతం నుంచి తరిలిపోతోందన్న భయంతో.. గత 17 రోజులుగా జరుగుతోన్న ఆందోళనల్లో ఆయన చురుకుగా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. రైతు మృతితో తుళ్లూరు మండల రైతులు, మహిళలు కాసేపు మౌనం పాటించారు. కాగా రైతు మృతికి గవర్నమెంట్ బాధ్యత వహించాలని జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది.

రైతు మృతిపై స్పందించిన చంద్రబాబు :

అమరావతి ప్రాంత రైతు ఆకస్మిక మరణంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వం చేతికానితనంవల్లే రైతుల బలవుతున్నారని మండిపడ్డారు. ఇటీవలే తిరుపతిలో ఒక రైతు మృతి చెందాడని..తాజాగా దొండపాడుకు చెందిన మల్లికార్జునరావు అనే రైతు మరణం బాధాకరమన్నారు. భూములిచ్చిన రైతులకు ఆవేదన ఉంటుందని..వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు చంద్రబాబు.