‘జోహార్‌’ పోస్టర్ వచ్చింది..

|

Jul 26, 2020 | 6:26 AM

పొలిటిక‌ల్ డ్రామాతో వస్తున్న ‘జోహార్‌’ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఆగ‌స్ట్ 14న‌ ‘ఆహా’లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఈ చిత్రం ద్వారా తేజ మార్ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. భాను సందీప్ ఈ చిత్ర నిర్మాత. ‘జోహార్’ పోస్ట‌ర్‌ను ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ విడుద‌ల చేశారు. భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన పొలిటిక‌ల్ డ్రామాగా ‘జోహార్‌’ చిత్రం రూపొందిందని అల్లు అరవింద్ అన్నారు. ఎంగేజింగ్ విజువ‌ల్స్‌తో అంద‌రినీ ఈ సినిమా మెప్పిస్తుంది […]

‘జోహార్‌’ పోస్టర్ వచ్చింది..
Follow us on

పొలిటిక‌ల్ డ్రామాతో వస్తున్న ‘జోహార్‌’ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఆగ‌స్ట్ 14న‌ ‘ఆహా’లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఈ చిత్రం ద్వారా తేజ మార్ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. భాను సందీప్ ఈ చిత్ర నిర్మాత. ‘జోహార్’ పోస్ట‌ర్‌ను ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ విడుద‌ల చేశారు. భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన పొలిటిక‌ల్ డ్రామాగా ‘జోహార్‌’ చిత్రం రూపొందిందని అల్లు అరవింద్ అన్నారు. ఎంగేజింగ్ విజువ‌ల్స్‌తో అంద‌రినీ ఈ సినిమా మెప్పిస్తుంది అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం ద్వారా ఇంకా కొత్త టాలెంట్‌ను తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేయ‌డం చాలా హ్య‌ాపీగా ఉందని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర ద‌ర్శ‌కుడు తేజ మార్ని, నిర్మాత భాను సందీప్ పాల్గొన్నారు.

‘జోహార్’ చిత్రంతో పాటు మ‌రికొన్ని ఎగ్జైటింగ్ రిలీజ్‌లు ఆగస్ట్ నెలలో తెలుగు ‘ఆహా’ ఓటీటీలో సందడి చేయనున్నాయి. అతి త‌క్కువ కాలంలోనే తెలుగు ప్రేక్ష‌కులను మెప్పించింది. తెలుగు ఓటీటీ మాధ్య‌మంగా ’ఆహా’ అని పేరు తెచ్చుకుంది. ఇప్ప‌టికే ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను అందించింది ‘ఆహా’. ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి రెడీ అవుతోంది.