కౌంట్‌డౌన్‌ స్టార్ట్స్..3.. 2… 1…అవును.. గ్రేటర్‌లో హై వోల్టేజీ సిట్యుయేషన్.. మరింత హీట్ పెంచుతున్న బల్దియా దంగల్‌

|

Nov 27, 2020 | 8:12 AM

గ్రేటర్‌ ప్రచారంలో అధికార, విపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలతో ఇప్పటికే రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. ఇక నగరంలో హై వోల్టేజీ సిట్యుయేషన్‌..

కౌంట్‌డౌన్‌ స్టార్ట్స్..3.. 2... 1...అవును.. గ్రేటర్‌లో హై వోల్టేజీ సిట్యుయేషన్.. మరింత హీట్ పెంచుతున్న బల్దియా దంగల్‌
Follow us on

Greater Hyderabad Campaign : కౌంట్‌డౌన్‌ స్టార్ట్స్‌… 3.. 2… 1…అవును ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. గ్రేటర్‌ క్యాంపెయిన్‌ ఎల్లుండితో  ముగుస్తుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి. ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌ను తలపించేలా జరిగింది ఎన్నికల ప్రచారం. మరి చివరి ఓవర్లలో ఎవరు ఎలాంటి ఫీట్స్‌ చేస్తారో చూడాలి.

గ్రేటర్‌ ప్రచారంలో అధికార, విపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలతో ఇప్పటికే రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. ఇక నగరంలో హై వోల్టేజీ సిట్యుయేషన్‌. ఎందుకంటే..రేపు సాయంత్రం సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ… అలాగే నగరంలో… ప్రధాని మోదీ అధికారిక పర్యటన. దీంతో గ్రేటర్‌ ఎన్నికల రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టీ హైదరాబాద్‌పైనే పడింది.

రేపు సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 30 వేలమందితో సభ ఏర్పాటు చేయడం ద్వారా గ్రేటర్‌ ఎన్నికల వాతావరణాన్ని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మలచుకోవాలనే వ్యూహాత్మక ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నారు. ఇన్నాళ్లూ హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు… ఇకపై చేయబోయే పనుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించే అవకాశం ఉంది.

ఇక మోదీ కూడా రేపు హైదరాబాద్‌కు వస్తున్నారు. కరోనాకు విరుగుడుగా భారత్‌ బయోటెక్‌ ఫార్మా కంపెనీ తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్‌’ పురోగతిని ప్రధాని పరిశీలించనున్నారు. అయితే – కేసీఆర్‌ బహిరంగ సభ రోజే ప్రధాని పర్యటన ఖరారు కావడం చర్చనీయాంశం అయ్యింది. మొత్తం మీద రేపు నగరంలో హై వోల్టేజీ వాతావరణం కనిపించనుంది.